చైనా ‘బూచి’.. రష్యా నుంచి యుధ్ధ విమానాల కొనుగోలుకు ఇండియా రెడీ !

చైనా 'బూచి' నేపథ్యంలో ఇండియా తన వైమానిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు సమాయత్తమైంది. రష్యా నుంచి కొత్తగా 12 సుఖోయ్, 21 మిగ్-29 విమానాలు కొనుగోలు చేయాలని  నిర్ణయించింది.  భారత వైమానిక దళం అప్పుడే ఇందుకు సంబంధించి..

చైనా 'బూచి'.. రష్యా నుంచి యుధ్ధ విమానాల కొనుగోలుకు ఇండియా రెడీ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 18, 2020 | 7:27 PM

చైనా ‘బూచి’ నేపథ్యంలో ఇండియా తన వైమానిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు సమాయత్తమైంది. రష్యా నుంచి కొత్తగా 12 సుఖోయ్, 21 మిగ్-29 విమానాలు కొనుగోలు చేయాలని  నిర్ణయించింది.  భారత వైమానిక దళం అప్పుడే ఇందుకు సంబంధించి ప్రక్రియ ప్రారంభించిందని, దీన్ని త్వరగా ఆమోదించాలని ప్రభుత్వానికి పంపిందని తెలుస్తోంది. రూ. 5 వేల  కోట్లతో వీటి కొనుగోలు ప్రతిపాదనను రూపొందించారు. వచ్ఛే వారం ఈ ప్రాజెక్టును  రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదించే అవకాశాలు కనబడుతున్నాయి. 2016 లో 36 రఫెల్ విమానాల కొనుగోలుకు వైమానిక దళం సిధ్ధపడిన అనంతరం.. మొత్తం 33 విమానాలను పొందడానికి ఇండియా చేస్తున్న రెండో యత్నమిది.

భారత చైనా దళాల మధ్య లదాఖ్ లోని గాల్వన్ వ్యాలీలో ఇటీవల పెద్ద ఎత్తున ఘర్షణ జరిగి..  రెండు వైపులా తీవ్ర ‘నష్టం’ వాటిల్లిన దరిమిలా ఇండియా తాజాగా తన వైమానిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి నడుం కట్టింది. ఇప్పటికీ సంబంధిత ప్రాంతంలో ఉద్రిక్తత సడలలేదు.