చైనా కంపెనీకి ఇండియ‌న్ రైల్వే షాక్‌ !

డ్రాగ‌న్ కంట్రీపై యావ‌త్ భార‌తావ‌ని భ‌గ్గుమంటోంది. లడఖ్​ వ్యాలీలో ఇండియన్ ఆర్మీ జవాన్లు 20 మంది ప్రాణాల్ని బలిగొన్న చైనాకు బుద్ధి చెప్పాలని, ఆ దేశానికి సంబంధించిన వస్తువులను బ్యాన్ చేయాలని సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియ‌న్ రైల్వే కూడా చైనాకు బుద్ధి చెప్పాల‌ని..

చైనా కంపెనీకి ఇండియ‌న్ రైల్వే షాక్‌ !
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 18, 2020 | 7:38 PM

డ్రాగ‌న్ కంట్రీపై యావ‌త్ భార‌తావ‌ని భ‌గ్గుమంటోంది. లడఖ్​ వ్యాలీలో ఇండియన్ ఆర్మీ జవాన్లు 20 మంది ప్రాణాల్ని బలిగొన్న చైనాకు బుద్ధి చెప్పాలని, ఆ దేశానికి సంబంధించిన వస్తువులను బ్యాన్ చేయాలని సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియ‌న్ రైల్వే కూడా చైనాకు బుద్ధి చెప్పాల‌ని నిర్ణ‌యించుకుంది.

 ఓ చైనా కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్టును ర‌ద్దు చేయాల‌ని రైల్వేశాఖ నిర్ణ‌యించింది. బీజింగ్‌కు చెందిన ఓ కంపెనీతో 2016లో రూ. 471 కోట్ల‌కు రైల్వేశాఖ ఓ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్ర‌కారం కాన్పూర్‌-మొగ‌ల్ స‌రాయి రైల్వే లైన్‌లో 417 కిలోమీట‌ర్ల టెలిక‌మ్యూనికేష‌న్‌, సిగ్న‌లింగ్ పూర్తిచేయాలి. అయితే, 2019 లోపు ప‌నులు పూర్తికావాల్సి ఉన్నా ఇప్ప‌టికీ 20శాతం కూడా కాలేద‌ని అందుకే కాంట్రాక్ట్‌ ర‌ద్దు చేస్తున్న‌ట్లు రైల్వేశాఖ వెల్ల‌డించింది.

భార‌త్‌-చైనాల మ‌ధ్య వివాదం ముదురుతున్న వేళ ఓ కేంద్ర‌మంత్రి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. చైనీస్   ఫుడ్‌ని అమ్మే రెస్టారెంట్ల‌ను బ్యాన్ చేయాల‌ని కేంద్ర‌మంత్రి రాందాస్ అథ‌వాలే డిమాండ్ చేశారు. అలాగే ప్ర‌జ‌లు చైనీస్ ఫుడ్‌ని బ‌హిష్క‌రించాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. కాగా గ‌తంలో ఈయ‌నే క‌రోనా వైర‌స్ విష‌యంలో గో క‌రోనా గో అంటూ పిలుపునివ్వ‌డం అది వైర‌ల‌వ‌డం తెలిసిందే.