దేశంలో మూడో రోజూ స్వల్పంగా తగ్గిన కోవిడ్ కేసులు, ఆసుపత్రుల్లో మారని పరిస్థితులు, ఆక్సిజన్ సరఫరాలో జాప్యం

దేశంలో మూడో రోజు కూడా కోవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. సోమవారం 3.57 లక్షల కేసులు నమోదయ్యాయని, 3,449 మంది రోగులు మరణించారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ,,,

దేశంలో మూడో రోజూ స్వల్పంగా తగ్గిన కోవిడ్ కేసులు, ఆసుపత్రుల్లో మారని పరిస్థితులు, ఆక్సిజన్ సరఫరాలో జాప్యం
India Sees A Dip In Covid Cases
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 04, 2021 | 11:40 AM

దేశంలో మూడో రోజు కూడా కోవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. సోమవారం 3.57 లక్షల కేసులు నమోదయ్యాయని, 3,449 మంది రోగులు మరణించారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో కేసులుకాస్త తగ్గడం ఊరట కలిగిస్తోందని ఈ శాఖ పేర్కొంది. మహారాష్ట్రలో 48,621, కర్ణాటకలో 44,438, యూపీలో 29,052, కేరళలో 26,011, తమిళనాడులో 20,952 కేసులు నమోదయ్యాయి. ముంబైలో 24 గంటల్లో 2,624 కేసులు నమోదయ్యాయి. 5 వారాల తరువాత ఒక్క రోజులో ఇది చాలా తగ్గుదల అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కోవిద్ టెస్టులు కూడా తగ్గాయని, గతంలో రోజుకు 50 వేల టెస్టులు జరగగా..ఆదివారం నాటికీ ఇవి 38 వేలకు తగ్గాయని ఈ వర్గాలు  వివరించాయి.మహారాష్ట్రలో రికవరీ రేటు 84.7 శాతం ఉండగా..పాజిటివిటీ రేటు 17.12 శాతం ఉంది. కాగా, కర్ణాటక, తమిళనాడు, బెంగాల్, ఏపీ, రాజస్థాన్, యూపీ రాష్ట్రాల్లో కోవిడ్  మహమ్మారి ఇంకా ప్రబలంగానే ఉంది.

ఇలా ఉండగా 120 మెట్రిక్ టన్నుల  లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ తో కూడిన 6 ట్యాంకర్లు ఢిల్లీకి చేరాయి. కానీ దేశంలోని వివిధ ఆసుపత్రులని ఆక్సిజన్ కొరత పీడిస్తూనే ఉంది. అలాగే ప్రాణాధార మందుల కొరత కూడా తీవ్రంగానే ఉంది. ఢిల్లీలో పలు కార్పొరేట్ హాస్పిటల్స్ లో  బెడ్స్ లేక అనేకమంది రోగులు ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నా ఫలితం లేకపోతోంది. కొన్ని ఆసుపత్రులు ఆక్సిజన్ కోసం ఎస్ ఓ ఎస్ మెసేజులను ఇంకా పంపుతున్నాయి. అటు-కోవిడ్ పరిస్థితిని ఆసరాగా చేసుకుని సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారని ఢిల్లీ పోలీసులు అంటున్నారు. ఆక్సిజన్ సిలిండర్లు, రెమ్ డెసివిర్   మందులు తమవద్ద ఉన్నాయని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే వీటిని అందజేస్తామని అంటూ అమాయక రోగులను వీరు మోసగిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు.   వారు చెప్పిన ఆకొంట్లలో సొమ్ము  క్రెడిట్ చేస్తే ఇక అంతే సంగతులని, అందువల్ల   అప్రమత్తంగా ఉండాలని, ఏ మాత్రం అనుమానం కలిగినా తమ దృష్టికి తేవాలని ఖాకీలు కోరుతున్నారు.

మరిన్ని చదవండి ఇక్కడ : ఓటీటీలో దుమ్మురేపుతున్న పవన్ కళ్యాణ్ వీడియో వకీల్ సాబ్ … :Vakeel Saab creates record OTT video. మూగజీవాలపై యాసిడ్ దాడి ..?ఏపీ లో మరో భయం! యాసిడ్ లంపి వైరస్ హడల్ వైరల్ వీడియో …