Explainer: రైళ్లల్లో మరో కొత్త శకం .. తొలి ర్యాపిడ్ రైలును ప్రారంభించనున్న ప్రధాని మోడీ..

నేటి నుంచి ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానుండగా.. ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్ 17కిలోమీటర్ల పొడవైన ప్రాధాన్యతా విభాగంలో సాహిబాబాద్ నుంచి దుహై డిపో మధ్య ఐదు స్టేషన్ల మీదుగా పరుగులు తీయనున్నాయి. ఈ ర్యాపిడ్‌ రైళ్లు పూర్తి ఎయిర్‌ కండిషన్డ్‌గా తయారు చేయడంతోపాటు ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని అనేక ఫీచర్లు ఏర్పాటు చేశారు.

Explainer: రైళ్లల్లో మరో కొత్త శకం .. తొలి ర్యాపిడ్ రైలును ప్రారంభించనున్న ప్రధాని మోడీ..
Namo Bharat Train
Follow us
Surya Kala

|

Updated on: Oct 20, 2023 | 6:12 AM

భారత్‌లో వందేభారత్‌ తరహాలో మరో కొత్త రైళ్లు పట్టాలెక్కనున్నాయి. దేశంలోనే తొలి ర్యాపిడ్ రైలును ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. దేశంలో ఇప్పటికే సెమీ హైస్పీడ్ రైళ్లుగా వందే భారత్ ట్రైన్స్ పరుగులు పెడుతున్నాయి. ఇప్పుడు అంతకంటే వేగంతో ప్రయాణించే రైళ్లతో మరో కొత్త శకం మొదలు కాబోతోంది. ప్రయాణికుల మెరుగైన సేవలందించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ప్రాజెక్టును రూపొందించింది. దానిలో భాగంగా.. తొలి ర్యాపిడ్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. గంటకు 160 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ రైళ్లలో అనేక అధునాతన వసతులు ఏర్పాటు చేశారు. దేశంలోనే తొలిసారి ఢిల్లీ-ఘజియాబాద్‌ రీజనల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ కారిడార్‌లో సాహిబాబాద్‌-దుహై డిపో మధ్య దూసుకెళ్లనున్నాయి.

నేటి నుంచి ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానుండగా.. ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్ 17కిలోమీటర్ల పొడవైన ప్రాధాన్యతా విభాగంలో సాహిబాబాద్ నుంచి దుహై డిపో మధ్య ఐదు స్టేషన్ల మీదుగా పరుగులు తీయనున్నాయి. ఈ ర్యాపిడ్‌ రైళ్లు పూర్తి ఎయిర్‌ కండిషన్డ్‌గా తయారు చేయడంతోపాటు ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని అనేక ఫీచర్లు ఏర్పాటు చేశారు. ప్రతి ర్యాపిడ్‌ రైలులో ఒక కోచ్‌ను మహిళల కోసం రిజర్వు చేశారు.

ఈ రైళ్లు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రతి 15 నిమిషాలకు ఒకటి చొప్పున సర్వీసులందిస్తాయి. ప్రతి రైలులో ఆరు కోచ్‌లు.. ఏకకాలంలో 1700 మంది కూర్చొని, నిలబడి ప్రయాణించేలా ఏర్పాటు చేశారు. స్టాండర్డ్‌ కోచ్‌లో 72 సీట్లు, ప్రీమియం కోచ్‌లో 62 సీట్లు చొప్పున ఉంటాయి. ఇక.. స్టాండర్డ్‌ కోచ్‌లలో కనీస టికెట్‌ ధర 20 రూపాయలు కాగా.. గరిష్ఠ ధర 50 రూపాయలుగా నిర్ణయించారు. అలాగే, ప్రీమియం కోచ్‌లలో అయితే కనీస టికెట్‌ ధర 40 రూపాయలు కాగా.. గరిష్ఠ ధర 100 రూపాయలు నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.