AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Coronavirus: గుడ్‌న్యూస్‌.. దేశంలో తగ్గుతున్న కరోనా ఉధృతి.. గత 24గంటల్లో ఎన్ని కేసులంటే..?

Covid-19 Updates in India: దేశంలో కరోనా ఉధృ నానాటికీ పెరుగుతూనే ఉంది. కరోనా సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. మళ్లీ పెరుగుతున్న కేసులు

India Coronavirus: గుడ్‌న్యూస్‌.. దేశంలో తగ్గుతున్న కరోనా ఉధృతి.. గత 24గంటల్లో ఎన్ని కేసులంటే..?
India Corona
Shaik Madar Saheb
|

Updated on: Sep 21, 2021 | 9:53 AM

Share

Covid-19 Updates in India: దేశంలో కరోనా ఉధృ నానాటికీ పెరుగుతూనే ఉంది. కరోనా సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. మళ్లీ పెరుగుతున్న కేసులు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 26,115 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. కరోనా మహమ్మారి కారణంగా 252 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,35,04,534 కి పెరగగా.. మరణాల సంఖ్య 4,45,385 చేరింది. నిన్న కరోనా నుంచి 34,469 మంది కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,27,49,574 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 3,09,575 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కాగా.. 184 రోజుల తర్వాత యాక్టివ్ కేసుల సంఖ్య 3లక్షలకు తగ్గినట్లు హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. ప్రస్తుతం రికవరీ రేటు దేశంలో 97.75 శాతంగా ఉండగా.. పాజిటివ్ రేటు 2.08 శాతంగా ఉంది.

ఇదిలాఉంటే.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 81,85,13,827 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. గడిచిన 24గంటల్లో 96,46,778 మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది.

నిన్న దేశవ్యాప్తంగా 14,13,951 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ వెల్లడించింది. వీటితో కలిపి ఇప్పటివరకు దేశంలో 55,50,35,717 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది.

Also Read:

Tirumala Sarva Darshan tickets: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. 23 నుంచి అక్టోబర్‌ కోటా దర్శన టికెట్లు విడుదల..

Kidnapping the Bride: ఆ దీవిలో జరిగేవన్నీ రాక్షస వివాహాలే.. నచ్చిన యువతిని కిడ్నప్ చేసిమరీ పెళ్లి చేసుకునే యువకులు..

సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..