AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Charanjit Singh Channi: పాలనలో తనదైన మార్క్.. ప్రభుత్వ అధికారులకు పంజాబ్ కొత్త సీఎం కీలక ఆదేశాలు

New Punjab CM Charanjit Channi: పంజాబ్ కొత్త సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజు నుంచే పని మొదలుపెట్టేశారు.

Charanjit Singh Channi: పాలనలో తనదైన మార్క్.. ప్రభుత్వ అధికారులకు పంజాబ్ కొత్త సీఎం కీలక ఆదేశాలు
Charanjit Singh Channi
Janardhan Veluru
|

Updated on: Sep 21, 2021 | 10:36 AM

Share

New Punjab CM Charanjit Channi: పంజాబ్ కొత్త సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజు నుంచే ఆయన ఆ దిశకగా పని మొదలుపెట్టేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో క్రమశిక్షణ తీసుకొచ్చే దిశగా కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర, జిల్లా, తాహసిల్, బ్లాగ్ స్థానిలోని ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులందరూ ఉదయం 9 గంటలకే కార్యాలయాలకు చేరుకోవాలంటూ సీఎం చరణ్‌జీత్ సింగ్ సోమవారంరాత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వారు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత తీసుకురావాల్సిన అవసరముందన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు పనివేళల్లో తప్పనసరిగా ఉండేలా.. సంబంధిత శాఖల హెడ్స్ వారంలో రెండు సార్లు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. అలాగే తమ కింద పనిచేసే ఉద్యోగులు సరైన సమయానికి వస్తున్నారా..? లేదా? సరిగ్గా పనిచేస్తున్నారా?..లేదా? అన్న దానిపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న రోజువారీ కార్యకలాపాలు, రికార్డులపై శాఖల హెడ్స్ ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించేవారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు, అసమ్మతి కారణంగా పంజాబ్ సీఎం పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేయడం తెలిసిందే. ఆయన స్థానంలో చరణ్‌జీత్ సింగ్ చన్నీ ఆ రాష్ట్రానికి కొత్త సీఎం అయ్యారు.

Also Read..

మరోసారి మంచి మనసు చాటుకున్న బాలకృష్ణ.. చిన్నారి క్యాన్సర్ పేషేంట్‌కు చికిత్స కోసం ఆర్ధిక సాయం

కొత్త ఉద్యోగం రావడంతో పాత భార్య వద్దని గెంటేసిన భర్త.. సీన్ కట్ చేస్తే కలెక్టర్ కార్యాలయం ఎదుట..