Lottery: అదృష్టం తలుపుతట్టింది.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ఆటో డ్రైవర్‌.. ట్విస్ట్ ఏమిటంటే..?

Thiruvonam Bumper lottery: ఓనం పండుగ సదర్భంగా లాటరీ పెట్టారు.. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న వ్యక్తి.. ఏదో ఆశగా ఓ లాటరీ టికెట్‌ తీసుకున్నాడు.. కానీ అదృష్టం తన తలుపుతడుతుందని

Lottery: అదృష్టం తలుపుతట్టింది.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ఆటో డ్రైవర్‌.. ట్విస్ట్ ఏమిటంటే..?
Lottery
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 21, 2021 | 9:26 AM

Thiruvonam Bumper lottery: ఓనం పండుగ సదర్భంగా లాటరీ పెట్టారు.. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న వ్యక్తి.. ఏదో ఆశగా ఓ లాటరీ టికెట్‌ తీసుకున్నాడు.. కానీ అదృష్టం తన తలుపుతడుతుందని అస్సలు ఊహించలేదు.. కట్‌చేస్తే.. రాత్రికిరాత్రే కోటీశ్వరుడయ్యాడు. కేరళకు చెందిన ఓ ఆటో డ్రైవర్‌కు లాటరీలో రూ.12 కోట్ల బహుమతి లభించింది. ఓనం పర్వదినం సందర్భంగా నిర్వాహాకులు.. తిరుఓనం బంపర్‌ లాటరీ ఫలితాలను ఆదివారం ప్రకటించారు. ఈ లాటరీ ఫలితాల్లో టీఈ-645465 నంబరు టికెట్‌ బంపర్‌ బహుమతికి ఎంపిక అయింది. ఈ టికెట్‌ను కొనుగోలు చేసిన అదృష్టవంతుడు కేరళ ఎర్నాకుళం జిల్లాలోని మరాడుకి చెందిన ఆటో డ్రైవర్‌ పీఆర్‌ జయపాలన్ అని సోమవారం నిర్ధారణ అయింది.

ఆటో డ్రైవర్ అయిన జయపాలన్ తన లాటరీ టికెట్‌ను తీసుకొని మరాడు కెనరా బ్యాంక్‌కు వెళ్లగా.. బ్యాంకు సిబ్బంది, అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. లాటరీ విజేతను తానేనంటూ అక్కడున్న వారికి ఆటో డ్రైవర్‌ జయపాలన్‌ తెలిపాడు. ఈ లాటరీ టికెట్‌ను సెప్టెంబరు 10న త్రిప్పునితురలో కొనుగోలు చేసినట్లు జయపాలన్‌ తెలిపాడు. ఫాన్సీ నంబర్‌గా ఉన్న టికెట్‌ను తానే కొన్నానని.. దానితోపాటు.. వేరే టికెట్లను కూడా కొనుగోలు చేసినట్లు జయపాలన్‌ తెలిపాడు. ఆదివారం వార్తలు చూస్తున్న క్రమంలో మొదటి బహుమతి గెలుచుకున్న విషయం తెలిసిందని తెలిపాడు.

ఈ నంబర్‌కు బహుమతి లభిస్తుందని టికెట్‌ కొన్నప్పుడే భావించానని.. సంతోషం వ్యక్తంచేశాడు. అయితే.. లాటరీ సంఖ్యను నిర్ధారించిన తర్వాత మాత్రమే బంధువులకు ఈ విషయాన్ని చెప్పినట్లు వెల్లడించాడు. కాగా.. రూ.12 కోట్ల బహుమతి మొత్తంలో అన్నిరకాల పన్నులను మినహాయించగా మిగతా మొత్తం అతనికి దక్కుతుందని బ్యాంకు సిబ్బంది వెల్లడించారు.

Also Read:

Viral Video: దిక్కులు చూస్తూ నడిస్తే ఇలాగే ఉంటుంది.. ధ్యాస మార్చిపోయిన సింహానికి ఊహించని షాక్.. ఈ వీడియో చూస్తే నవ్వడం ఖాయం..

Viral News: వామ్మో.. పెళ్లి కాకముందే ఇన్ని కండీషన్సా..! ప్రియురాలికి ప్రియుడు పెట్టిన రూల్స్ తెలిస్తే..షాకవుతారు..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!