AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: వామ్మో.. పెళ్లి కాకముందే ఇన్ని కండీషన్సా..! ప్రియురాలికి ప్రియుడు పెట్టిన రూల్స్ తెలిస్తే..షాకవుతారు..

బంధం నిలబడాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడమే కాకుండా.. ఒకరిపై మరొకరి నమ్మకం ఉండాలి. తమ జీవితభాగస్వామిపై.. లేదా.. కాబోయే వారిపై విశ్వాసం ఉంటేనే..

Viral News: వామ్మో.. పెళ్లి కాకముందే ఇన్ని కండీషన్సా..! ప్రియురాలికి ప్రియుడు పెట్టిన రూల్స్ తెలిస్తే..షాకవుతారు..
Viral News
Rajitha Chanti
|

Updated on: Sep 20, 2021 | 6:24 PM

Share

బంధం నిలబడాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడమే కాకుండా.. ఒకరిపై మరొకరి నమ్మకం ఉండాలి. తమ జీవితభాగస్వామిపై.. లేదా.. కాబోయే వారిపై విశ్వాసం ఉంటేనే.. ఆ బంధం అనోన్యంగా కొనసాగుతుంది. రెండు మనసుల మధ్య చిన్నపాటి విభేదాలు కలిగిన… లేదా ఒకరిపై ఒకరికి నమ్మకం పోయిన.. ఆ బంధం బీటలు వారుతుంది. అయితే కేవలం నమ్మకం.. విశ్వాసాలే బంధాన్ని నిలబెడతాయి.. ఇద్దరిలో ఎవరికైనా.. అనుమానం మొదలైన… ఆ బంధానికి స్వస్తి పలకాల్సిందే. అయితే ప్రేమలో ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య అర్థం చేసుకునే స్వభావం ఉంటే.. ఆ ప్రేమ.. వివాహం వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రేమలో అనుమానం ఉంటే మాత్రం.. మధ్యలోనే బంధం విడిపోతుంది. ముఖ్యంగా ప్రేమలో ఉన్నప్పుడు ప్రియురాలిపై అనుమానం కలిగితే..ఇక అంతే సంగతులు. సాధారణంగా.. తన ప్రేయసిపై అనుమానం ఉన్నవారు.. వారిని అనుసరించడం.. వారి ప్రతి కదలికపై నిఘా పెడుతుంటారు. కొందరు నేరుగా వారితో గొడవ పెట్టుకుంటుంటారు. కానీ .. ఓ యువకుడు మాత్రం తనతో ప్రేమలో కోనసాగాలంటే.. 11 రూల్స్‏ను కచ్చితంగా పాటించాలని షరతు విధించాడు. అంతేకాదు.. తను పెట్టే నియమాలను ఒక నోట్ సిద్ధం చేసి తన ప్రియురాలికి అందించాడు.. అది చూసి ముందుగా ఆమె షాకయ్యింది. ఇంతకీ ఆ యువకుడు పెట్టిన నిబంధనలు ఏంటో తెలుసుకుందామా.

అమెరికా యూనివర్సిటీకి చెందిన విద్యార్థిని కరోలిన్.. తన బాయ్ ఫ్రెండ్ తమ రిలేషన్ కొనసాగాలంటే. 11 నియమాలను అనుసరించాల్సి ఉంటుందని చెప్పాడట. అందుకు ఓ జాబితాను కూడా ఇచ్చాడట. ఆ నోట్‏ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఆ నోట్ చూసిన నెటిజన్లు షాకయ్యారు. ఇప్పటికీ ఇలాంటి వారు కూడా ఉన్నారా ? అంటూ ఆశ్చర్యపోతున్నారు. కరోలిన్ బాయ్ ఫ్రెండ్ కంట్రోలింగ్ స్వభావం గురించి ఇప్పుడు నెట్టింట్లో తెగ ట్రోల్ అవుతుంది. అతడు విధించిన నిబంధనల ప్రకారం.. ఆమె బయట తినడం.. తిరగడం.. తాగడం.. బిగుతు దుస్తులు ధరించడం.. క్రాప్ టాప్ ధరించడం.. ఆల్కహాల్ తాగకూడదు అని కండిషన్స్ పెట్టాడు. ఇక ఇవే కాకుండా.. తను అబ్బాయిలతో మాట్లాడకూడదు.. కలవకూడదు అనే రూల్ కూడా విధించాడు. అలాగే తను ఇచ్చిన ఉంగరాన్ని ఎప్పటికీ తీసివేయకూడదు. అంతేకాకుండా.. రాత్రి 9 గంటలకు తిరిగి రావాలని సూచించాడు. అలాగే క్రాప్ టాప్… టైట్ డ్రెస్ వేసుకోకూడదు.. పార్టీలకు వెళ్లకూడదు. ప్రతిరోజూ.. తన బాయ్ ఫ్రెండ్ పెట్టిన కరోలిన్ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఈ నియమాలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అతడితో బంధాన్ని ముగించుకోవాలని ఆమె ఆలోచిస్తున్నట్లుగా కరోలిన్ తెలిపింది. కానీ.. ఆ విషయంపై ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. ఇక కరోలిన్ అదే నిర్ణయాన్ని తీసుకోవడం మంచిదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Bheemla Nayak: భీమ్లా నాయక్ అప్డేట్ వచ్చేసింది.. ధర్మేంద్ర అంటూ రానా వార్నింగ్..

Bigg Boss 5 Telugu: మరోసారి ఇంట్లో నామినేషన్స్ రచ్చ.. పనికిమాలిన రీజన్స్ అంటూ ఫైర్ అయిన ప్రియాంక..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!