Tirumala Sarva Darshan tickets: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. 23 నుంచి అక్టోబర్ కోటా దర్శన టికెట్లు విడుదల..
Tirumala Sarva Darshan ticket: తిరుమల తిరుపతి దేవస్థానం రూ.300 దర్శన టిక్కెట్ల అక్టోబర్ నెల కోటాను 23న విడుదల చేయనున్నట్లు టీటీడీ మంగళవారం తెలిపింది. రోజుకు 8 వేల
Tirumala Sarva Darshan ticket: తిరుమల తిరుపతి దేవస్థానం రూ.300 దర్శన టిక్కెట్ల అక్టోబర్ నెల కోటాను 23న విడుదల చేయనున్నట్లు టీటీడీ మంగళవారం తెలిపింది. రోజుకు 8 వేల టిక్కెట్ల చొప్పున విడుదల చేయనున్నట్లు తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా టీటీడీ వెబ్‌సైట్‌లో దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది. దీంతోపాటు 24వ తేది ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ టికెట్లను రోజుకి 8 వేల చొప్పున విడుదల చేయనున్నట్లు పేర్కొంది.
ఇదిలాఉంటే.. ఈరోజు తిరుమలలో సర్వదర్శనం టికెట్లను జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఉదయం ఆరు గంటల నుంచి శ్రీవారి ఉచిత దర్శనానికి టికెట్లను జారీ చేస్తున్నారు. దీంతో భక్తులు భారీగా బారులు తీరారు. అయితే.. ఈ సర్వదర్శనం కోసం తిరుమలో ఆఫ్‌లైన్‌లో జారీ చేస్తున్న టోకెన్లను 23వ తేది నుంచి నిలిపివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 24వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
కరోనా తీవ్రత తగ్గిన నేపథ్యంలో ఏడుకొండలపై కొలువైన శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనభాగ్యాన్ని అందరికి కలిగించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సర్వదర్శన టికెట్లను ఈ రోజు నుంచి ప్రారంభించింది. భక్తులకు కరోనావైరస్ సోకకుండా నిబంధనలు పాటిస్తూ శ్రీవారి భక్తులకు ఉచిత దర్శనభాగ్యాన్ని కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతిరోజూ ఉదయం 6.30 గంటల నుంచి సాయంత్రం 7.30 వరకూ భక్తులకు శ్రీవారిని దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుంది.
కరోనా తొలి దశ సమయంలో పరిమిత సంఖ్యలో భక్తులను కొండపైకి అనుమతించిన టీటీడీ.. ఆ తర్వాత సెకండ్ వేవ్ ప్రభావంతో సర్వదర్శనాల్ని పూర్తిగా నిలిపివేసింది. ప్రత్యేక దర్శనం రూ.300 రూపాయల టిక్కెట్‌పై కొందరికే తిరుమల ప్రవేశం కల్పిస్తూ వస్తోంది. అయితే కరోనా తీవ్రత తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడటంతో టీటీడీ సర్వదర్శనం టోకెన్లను జారీ చేసింది.
భక్తులు tirupatibalaji.ap.gov.in ద్వారా ఆధార్ కార్డ్ నంబర్, చిరునామాతో మాత్రమే టికెట్లు తీసుకోవాలని టీటీడీ సూచించింది. ఇతర వెబ్ సైట్లను నమ్మి మోసపోవద్దని తెలిపింది. శ్రీవారి దర్శన టికెట్లతో వ్యాపారం చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
Also Read: