Sarva Darshan Ticket: తిరుమలలో ప్రారంభమైన కౌంటర్లు.. శ్రీవారి సర్వ దర్శనానికి పోటెత్తిన భక్తులు..
Tirumala Sarva Darshan ticket: తిరుమలలో శ్రీవారి సర్వదర్శనం టికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి టీటీడీ సర్వదర్శనం టికెట్ల జారీని టీటీడీ
Tirumala Sarva Darshan ticket: తిరుమలలో శ్రీవారి సర్వదర్శనం టికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి టీటీడీ సర్వదర్శనం టికెట్ల జారీని టీటీడీ ప్రారంభించింది. కాగా.. ఇప్పటికే సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు తరలివచ్చి.. శ్రీనివాసం కాంప్లెక్స్ వద్ద ఫుట్‌పాత్‌పై భక్తులు బారులుతీరారు. సర్వదర్శనం టికెట్ల సంఖ్య పెంచుతూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వేలాది మంది భక్తులు తిరుమలకు తరలివచ్చారు. రోజుకు 8వేల సర్వదర్శనం టోకెన్లను మంజూరు చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. దీంతో భక్తులు శ్రీవారి సర్వదర్శన టికెట్ల కోసం బారులుతీరారు.
కాగా.. ఏడుకొండలపై కొలువైన శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనభాగ్యాన్ని అందరికి కలిగించే బృహత్తరమైన నిర్ణయాన్ని తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం. కరోనా కారణంగా కొండపై భక్తుల్ని అనుమతించే విషయంపై చర్చించి.. టీటీడీ ఐదు నెలల క్రితం ఉచిత దర్శనం టోకన్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఉదయం 8గంటల నుంచే సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు.
అయితే టీటీడీ ముందుగా చిత్తూరు జిల్లా వాసులకే ఉచిత దర్శన టోకెన్లు అందజేస్తోంది. అది కూడా రోజుకు పరిమిత సంఖ్యలో అంటే 2వేల టిక్కెట్లను మాత్రమే జారీ చేస్తున్నట్లుగా ప్రకటించింది. భక్తులకు కరోనావైరస్ సోకకుండా నిబంధనలు పాటిస్తూ శ్రీవారి భక్తులకు ఉచిత దర్శనభాగ్యాన్ని కల్పిస్తోంది. టీటీడీ తీసుకున్న నిర్ణయం ఎంతో బాగుందంటూ భక్తులు కొనియాడుతున్నారు.
కరోనా తొలి దశ సమయంలో పరిమిత సంఖ్యలో భక్తులను కొండపైకి అనుమతించిన టీటీడీ.. ఆ తర్వాత సెకండ్ వేవ్ ప్రభావంతో సర్వదర్శనాల్ని పూర్తిగా నిలిపివేసింది. ప్రత్యేక దర్శనం రూ.300 రూపాయల టిక్కెట్‌పై కొందరికే తిరుమల ప్రవేశం కల్పిస్తూ వస్తోంది. అయితే కరోనా తీవ్రత తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడటంతో టీటీడీ సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తూ శ్రీవారి ఆశీస్సులు అందరికి కలిగేలా చేసింది.
Also Read: