AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Act of War: యుద్ధమే..! ఉగ్రవాదంపై మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇకపై పాకిస్తాన్ గజగజ వణకాల్సిందే..

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులతో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాడు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి కొన్ని గంటల ముందు జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ కూడా ప్రధానితో భేటీ అయ్యారు. భారత్ - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలోఈ భేటీ జరిగింది.

Act of War: యుద్ధమే..! ఉగ్రవాదంపై మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇకపై పాకిస్తాన్ గజగజ వణకాల్సిందే..
Pm Modi
Shaik Madar Saheb
|

Updated on: May 10, 2025 | 4:52 PM

Share

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం పతాకస్థాయికి చేరుకుంటోంది. రోజురోజుకూ బార్డర్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఎక్కువవుతున్నాయి. భారత్ ఆపరేషన్ సిందూర్ తో బుద్ధి చెప్పినా.. పాక్ వక్రబుద్ధి మాత్రం మారడం లేదు.. ఇండియన్‌ ఆర్మీ చేస్తున్న మెరుపుదాడులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పాక్‌… సామాన్య ప్రజలే లక్ష్యంగా సరిహద్దుల్లో దాడులకు తెగబడుతోంది. భారత దళాలు అదేస్థాయిలో తిప్పికొడుతున్నా దాయాదికి బుద్ధి రావడం లేదు.. ఈ క్రమంలో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదానికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకనుంచి దేశంపై జరిగే ఉగ్రదాడులను యుద్ధంగానే పరిగణించాలని నిర్ణయించింది.

భవిష్యత్తులో జరిగే ఏదైనా ఉగ్రవాద చర్యను భారతదేశానికి వ్యతిరేకంగా జరిగే “యుద్ధ చర్య”గా పరిగణించాలని.. దానికి అనుగుణంగా ప్రతిస్పందించాలని భారతదేశం నిర్ణయించిందని ప్రభుత్వ ఉన్నత వర్గాలు శనివారం తెలిపాయి. భారతదేశం – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం న్యూఢిల్లీలోని తన నివాసంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS), భారత సాయుధ దళాల అధిపతులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా పాక్‌ దాడులను తిప్పికొట్టేందుకు వ్యూహాలను రచించడంతోపాటు.. సరిహద్దుల్లో భద్రత స్థితిగతులపై మోదీ అడిగి తెలుసుకున్నారు.

ఈ భేటీకి కొన్ని గంటల ముందు జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ కూడా ప్రధానితో భేటీ అయ్యారు. భారత్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలోఈ భేటీ జరిగింది.

పాక్‌ ఆరోపణలపై స్పందించిన ఆఫ్గాన్‌ రక్షణ శాఖ

పాకిస్తాన్ చేస్తున్న పలు ప్రకటనల్లో ఎలాంటి వాస్తవం లేదని తేలిపోతోంది. పాక్‌పై దాడి చేసేందుకు ఆఫ్గానిస్తాన్ భూభాగాన్ని భారత్ వాడుకుంటోందన్న ఆరోపణలను ఆ దేశం ఖండించింది. పాక్ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆఫ్గన్ విదేశాంగ ప్రతినిధి ఇనాయతుల్లా తెలిపారు. తమ భూభాగం నుంచి భారత్‌ దాడి చేయలేదని వివరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..