AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాక్ బండారం బయటపెట్టేందుకు కేంద్రం ఫ్లాన్.. ప్రతినిధుల బృందంలో అసద్, శశిథరూర్‌కు చోటు!

యూరప్, మధ్యప్రాచ్యంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి పాకిస్తాన్ కొనసాగుతున్న మద్దతును బహిర్గతం చేసే లక్ష్యంతో ఏర్పాటు చేసిన భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో పార్టీ సీనియర్ నాయకుడు శశి థరూర్ భాగం కానున్నారనే వార్తలను కేరళ కాంగ్రెస్ శుక్రవారం స్వాగతించింది. ఈ పరిణామాలపై స్పందిస్తూ, కేరళ కాంగ్రెస్ X లో పోస్ట్ చేసింది.

పాక్ బండారం బయటపెట్టేందుకు కేంద్రం ఫ్లాన్.. ప్రతినిధుల బృందంలో అసద్, శశిథరూర్‌కు చోటు!
India Plans Mega Global Outreach Against Pakistan
Balaraju Goud
|

Updated on: May 17, 2025 | 10:03 AM

Share

భారత్‌- పాక్‌ ఉద్రిక్తతల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ సమర్థంగా వ్యవహరించారంటూ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, పార్లమెంటు సభ్యులు శశిథరూర్‌ ప్రశంసించారు. ఉగ్రవాదం విషయంలో దాయాది దేశానికి స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారన్నారు. సొంత పార్టీలోనే శశిథరూర్‌ వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తమైంది. శశిథరూర్‌ లక్ష్మణ రేఖ దాటారని పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. గత కొన్నేళ్లుగా శశిథరూర్‌కు, కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి మధ్య దూరం పెరిగిందనే మాట వినిపిస్తోంది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేరళ కాంగ్రెస్ నేతలు సమర్థించారు.

యూరప్, మధ్యప్రాచ్యంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి పాకిస్తాన్ కొనసాగుతున్న మద్దతును బహిర్గతం చేసే లక్ష్యంతో ఏర్పాటు చేసిన భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో పార్టీ సీనియర్ నాయకుడు శశి థరూర్ భాగం కానున్నారనే వార్తలను కేరళ కాంగ్రెస్ శుక్రవారం స్వాగతించింది. ఈ పరిణామాలపై స్పందిస్తూ, కేరళ కాంగ్రెస్ X లో పోస్ట్ చేసింది. దేశానికి ప్రపంచ స్థాయిలో విశ్వసనీయ ప్రతినిధి అవసరమని పేర్కొంది. “ప్రధానమంత్రి మోదీ, ఆయన విదేశాంగ మంత్రి అంతర్జాతీయంగా విశ్వసనీయతను కోల్పోయిన సమయంలో, దేశానికి గౌరవం ఇచ్చే స్వరం అవసరం. అందుకే బీజేపీలోని ప్రతిభ శూన్యతను గుర్తించి, దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి కాంగ్రెస్ నాయకుడిని ఎంచుకున్నందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాము” అని పోస్ట్ చేసింది.

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ తర్వాత , ఉగ్రవాదంలో పాకిస్తాన్ పాత్రను ఎత్తిచూపడానికి ప్రభుత్వం ఒక ప్రధాన దౌత్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ప్రపంచ దేశాలకు దుష్ట పాకిస్థాన్ ద్వంద నీతి ఎండ కట్టేందుకు భారత్ ఫ్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా భారత్ తరుఫున ప్రతినిధుల బృందాన్ని అయా దేశాలకు పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ ప్రణాళికలో భాగంగా దాదాపు 40 మంది ఎంపీలు పాల్గొంటారు. వారిని ఏడు ప్రాంతీయ గ్రూపులుగా విభజించనున్నారు. ప్రతి గ్రూపులో 7–8 మంది సభ్యులు ఉంటారు. మే 22–23 తేదీల నుండి ప్రారంభమయ్యే 10 రోజుల వ్యవధిలో నాలుగు నుండి ఐదు దేశాలను సందర్శిస్తారని భావిస్తున్నారు. ఒక భారత విదేశాంగ వ్యవహారాల శాఖ అధికారి కూడా ప్రతినిధులతో కలిసి ప్రయాణించనున్నారు. ఈ బృందంలో కాంగ్రెస్ ఎంపీలు శశి థరూర్, మనీష్ తివారీ, సల్మాన్ ఖుర్షీద్, అమర్ సింగ్‌లను సంప్రదించామని, వారు పాల్గొంటారని పిటిఐ పేర్కొంది. ప్రతినిధి బృందంలోని ఇతర సభ్యులలో బీజేపీ, టీఎంసీ, డీఎంకే, ఎన్‌సీపీ (ఎస్పీ), జేడీయూ, బీజేడీ, సీపీఐ (ఎం), ఏఐఎంఐఎం నాయకులు కూడా ఉన్నారు.

బీజేపీ నుంచి అనురాగ్ ఠాకూర్, అపరాజిత సారంగి చేరాలని భావిస్తున్నారు. సుదీప్ బంద్యోపాధ్యాయ (టీఎంసీ), సంజయ్ ఝా (జేడీయూ), సస్మిత్ పాత్ర (బిజెడి), సుప్రియా సూలే (ఎన్‌సిపి-ఎస్‌పి), కనిమొళి (డిఎంకె), జాన్ బ్రిట్టాస్ (సిపిఐ-ఎం), అసదుద్దీన్ ఒవైసీ (ఎఐఎంఐఎం) వంటి ఇతర ఎంపీలను పరిశీలిస్తున్నారు. సంప్రదించిన పార్టీలలో ఒకదానికి చెందిన ఒక నాయకుడు పిటిఐకి మాట్లాడుతూ, మే 22 నాటికి విదేశీ మిషన్‌కు సిద్ధంగా ఉండాలని వారికి సూచించినట్లు సమాచారం. ప్రయాణ ప్రణాళికలతో సహా తుది వివరాలను MEA త్వరలో పంచుకుంటుందని చెప్పారు.

ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పార్టీ నాయకత్వంతో ఈ ప్రణాళిక గురించి చర్చించారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ పిటిఐతో చెప్పారు. పాకిస్తాన్‌పై వచ్చిన ఆరోపణలకు మద్దతుగా విదేశాంగ మంత్రిత్వ శాఖ, హోం, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలతో సమన్వయంతో ప్రస్తుతం వాస్తవ పత్రాలు, కేసు ఆధారాలను ప్రపంచ దేశాలకు వివరించనున్నారు.

విదేశాలకు 7 ఆల్ పార్టీ ఎంపీల బృందాలను పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మే 22, 23 తేదీల్లో ప్రపంచ దేశాలకు వేర్వేరు బృందాలు వెళ్లనున్నాయి. ఇదులో భాగంగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలో బృందం అమెరికాకు వెళ్లనుంది. అలాగే తూర్పు ఐరోపా దేశాలకు బైజయంత్ పాండా నేతృత్వంలోని బృందం పర్యటించనుంది. డీఎంకే ఎంపీ కనిమొళి నేతృత్వంలోని బృందం రష్యాకు, ఆగ్నేయాసియాకు వెళ్లే బృందానికి సంజయ్ ఝా నేతృత్వం వహించనున్నారు. ఇక, మిడిల్ ఈస్ట్ దేశాలకు రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలో బృందాలు వెళ్తాయి. పశ్చిమాసియా దేశాలకు సుప్రియా సూలే నాయకత్వం వహించనున్నారు. ఆఫ్రికన్ దేశాలకు శ్రీకాంత్ షిండే నేతృత్వం వహిస్తారని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా పాక్ ఉగ్రవాదం, దుశ్చర్యలను ఎండగట్టనున్నాయి భారత్ బృందాలు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..