స్విస్ ఖాతాల వివరాలు వచ్చేశాయి.. మోదీ నెక్స్ట్ ప్లానేంటి?

బడాబాబులు విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని తిరిగి తెప్పిస్తామన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఆ దిశగా ఒక్కో అడుగు వేస్తున్నారు. స్విస్ బ్యాంకుల్లో ధనాన్ని దాచుకున్న భారతీయుల ఖాతాల తొలి విడత వివరాలు వచ్చేశాయి. ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకునే (ఏఐఓఐ) విధానంలో ఈ వివరాలను అందించినట్టు స్విట్జర్లాండ్‌ దేశానికి చెందిన ఫెడరల్‌ ట్యాక్స్‌ అడ్మినిస్ర్టేషన్‌ (ఎఫ్‌టీఏ)కు ఒక అధికారి పీటీఐ వార్తాసంస్థకు వెల్లడించారు. ఈ విధానం కింద ఇండియా ఇలాంటి వివరాలు పొందడం ఇదే తొలిసారి కావడం విశేషం. […]

స్విస్ ఖాతాల వివరాలు వచ్చేశాయి.. మోదీ నెక్స్ట్ ప్లానేంటి?
Follow us

|

Updated on: Oct 08, 2019 | 1:36 AM

బడాబాబులు విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని తిరిగి తెప్పిస్తామన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఆ దిశగా ఒక్కో అడుగు వేస్తున్నారు. స్విస్ బ్యాంకుల్లో ధనాన్ని దాచుకున్న భారతీయుల ఖాతాల తొలి విడత వివరాలు వచ్చేశాయి. ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకునే (ఏఐఓఐ) విధానంలో ఈ వివరాలను అందించినట్టు స్విట్జర్లాండ్‌ దేశానికి చెందిన ఫెడరల్‌ ట్యాక్స్‌ అడ్మినిస్ర్టేషన్‌ (ఎఫ్‌టీఏ)కు ఒక అధికారి పీటీఐ వార్తాసంస్థకు వెల్లడించారు. ఈ విధానం కింద ఇండియా ఇలాంటి వివరాలు పొందడం ఇదే తొలిసారి కావడం విశేషం.
తాజాగా అందిన వివరాల్లో ఎక్కువగా వ్యాపారులు, ఎన్నారైలు ఉన్నారని తెలుస్తోంది. నల్లధనం వెలికితీతకు చర్యలు ఉంటాయన్న భయంతో పలువురు తమ ఖాతాలు మూసివేశారని, అలాంటి వారి వివరాలు ఎక్కువగా ఉన్నట్లు కూడా సమాచారం. ఇక 2018లో మూసివేసిన ఖాతాలు, లావాదేవీల వివరాలు తొలి విడతగా అందినట్లు తెలుస్తోంది. మరోవైపు 2019కి సంబంధించిన వివరాలు 2020 సెప్టెంబర్‌అందనున్నాయి. ప్రస్తుతం అందిన వివరాల ప్రకారం లెక్కల్లో చూపని ఆదాయం కలిగిన వారిపై విచారణ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏది ఏమైనా నల్లధనం వెలికితీతలో భాగంగా నరేంద్రమోదీ మొదలుపెట్టిన ఈ మహత్తర కార్యక్రమం ఎంత వరకు విజయం సాధిస్తుందో వేచి చూడాలి.