India Pakistan: పాక్ హైకమిషన్ ఉద్యోగిని బహిష్కరించిన భారత్.. ఎందుకో తెలుసా?
ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో పనిచేస్తున్న పాకిస్తాన్ అధికారిపై భారత్ వేటు వేసింది. రాయబార కార్యాలయ అధికారి ముసుగులో ఉంటూ భారత సైన్యం సమాచారాన్ని పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐకు చేరవేస్తున్నట్టు భారత్ గుర్తించింది. అతన్ని రాయబార కార్యాలయంలో ఉండేందుకు అర్హతలేని వ్యక్తిగా భారత్ ప్రకటించింది. 24 గంటల్లో విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది.

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు సద్దుమణుగుతున్న వేళ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో పనిచేస్తున్న పాకిస్తాన్ అధికారిని భారత్ నుంచి బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆతను రాయబార కార్యాలయ పరిధి దాటి కార్యకలాపాలు సాగిస్తున్నట్టు గుర్తించింది. రాయబార కార్యాలయంలో ఉద్యోగిగా ఉంటూ ఐఎస్ఐ(ISI) కోసం పనిచేస్తున్నాడని భారత్ గర్తించింది.
భారత రక్షణ శాఖకు చెందిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐకు చేరవేస్తున్నాడన్న సమాచారంతో కేంద్ర ప్రభుత్వం అతనిపై చర్యలు తీసుకుంది. గూఢచారిగా ఉంటూ ఐఎస్ఐ కోసం పనిచేసే వ్యక్తిని రాయబార కార్యాలయంలో ఉండేందుకు అర్హతలేని వ్యక్తిగా భారత్ ప్రకటించింది. అంతేకాదు.. 24 గంటల్లో దేశం విడిచిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. లేకపోతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు తీవ్ర స్థాయికి చేరాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఆ తర్వాత అమెరికా ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లో రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీంతో భారత్ -పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు సద్దుమణిగాయి. ఈ తరుణంలో రాయబార కార్యాలయంలో ఉంటూ భారత్ సైన్యం సమాచారాన్ని ఐఎస్ఐకి చేరువేస్తున్న ఓ ఉగ్యోదిగిపై భారత్ వేటు వేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




