AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాక్‌ ఎయిర్‌ బేస్‌లను గట్టిగా దెబ్బకొట్టాం.. అయినా ఫేక్‌ ప్రచారం చేస్తోంది! వివరాలు వెల్లడించిన మిస్త్రీ

పాకిస్థాన్‌ మనపై చేస్తున్న దాడులపై ప్రతిదాడిగా పాక్‌లోని ఎయిర్‌ బేస్‌లను ధ్వంసం చేసినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్త్రీ వెల్లడించారు. పాకిస్థాన్‌లోని చక్లాలా, మురిద్, రహిమ్యార్ ఖాన్, రఫీకి ఎయిర్ బేస్‌లను భారత్ ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

పాక్‌ ఎయిర్‌ బేస్‌లను గట్టిగా దెబ్బకొట్టాం.. అయినా ఫేక్‌ ప్రచారం చేస్తోంది! వివరాలు వెల్లడించిన మిస్త్రీ
Wc Vamika Singh Vikram Misr
SN Pasha
| Edited By: |

Updated on: May 10, 2025 | 1:14 PM

Share

పాకిస్థాన్‌ మనపై చేస్తున్న దాడులపై ప్రతిదాడిగా పాక్‌లోని ఎయిర్‌ బేస్‌లను ధ్వంసం చేసినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్త్రీ వెల్లడించారు. పాకిస్థాన్‌లోని చక్లాలా, మురిద్, రహిమ్యార్ ఖాన్, రఫీకి ఎయిర్ బేస్‌లను భారత్ ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు పాకిస్థాన్‌ మన ఎయిర్‌ బేస్‌లపై దాడి చేసినట్లు సోషల్‌ మీడియాలో ఫేక్‌ ప్రచారం చేసుకుంటున్నట్లు కూడా ఆయన ఆరోపించారు. ఈ ఉదయం, పాకిస్తాన్ రాజౌరి పట్టణంపై షెల్ దాడి చేసింది, అదనపు జిల్లా అభివృద్ధి కమిషనర్ రాజ్ కుమార్ థాపా మరణించారు, పౌరుల ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో కల్నల్‌ సోఫియా ఖురేషి, వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌ పాల్గొని మరిన్ని విషయాలు వెల్లడించారు.

రఫీకి, మురిద్, చక్లాలా, రహీమ్ యార్ ఖాన్‌లోని పాకిస్తాన్ వైమానిక దళ స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. సుక్కూర్, చునియాలోని పాకిస్తాన్ సైనిక స్థావరాలు, పస్రూర్‌లోని రాడార్ సైట్, సియాల్‌కోట్ విమానయాన స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. భారతదేశ పశ్చిమ సరిహద్దులో చేపట్టే చర్యలతో భారత్‌ను పాక్‌ రెచ్చగొడుతోందని అన్నారు.

పౌర ప్రాంతాలు, సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడానికి పాకిస్తాన్ మానవరహిత యుద్ధ వైమానిక వాహనాలు, క్షిపణులు, ఫైటర్ జెట్‌లను ఉపయోగించిందని తెలిపారు. “భారత సాయుధ దళాలు వీటిని చాలావరకు అడ్డుకున్నాయి. అయితే, ఉధంపూర్, పఠాన్‌కోట్, అడంపూర్, భుజ్‌లోని భారత వైమానిక దళ స్టేషన్లలోని పరికరాలు, సిబ్బందికి పరిమిత నష్టం వాటిల్లింది” అని వారు పేర్కొన్నారు. ఇండియాలో ఎయిర్‌ బేస్‌లను ధ్వంసం చేసినట్లు పాకిస్థాన్‌ అబద్ధాలు ప్రచారం చేస్తుందని అని అన్నారు. పాక్‌ ప్రచార ఫేక్‌ అని కొన్ని ఫొటోలు కూడా చూపించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
HDMIకి పోటీగా GPMI వచ్చేసింది! వీడియో, డేటా, పవర్ అన్నీ ఒకేదానిలో
HDMIకి పోటీగా GPMI వచ్చేసింది! వీడియో, డేటా, పవర్ అన్నీ ఒకేదానిలో
విదేశాంగ మంత్రిత్వ శాఖలో MEA ఇంటర్న్‌షిప్‌.. డిగ్రీ పాసైతే చాలు!
విదేశాంగ మంత్రిత్వ శాఖలో MEA ఇంటర్న్‌షిప్‌.. డిగ్రీ పాసైతే చాలు!
పొరపాటున నిమ్మ గింజ మింగేశారా? మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే
పొరపాటున నిమ్మ గింజ మింగేశారా? మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే
వేడి వేడి సాంబార్‌లో పడి మహిళ మృతి..!
వేడి వేడి సాంబార్‌లో పడి మహిళ మృతి..!
5 సీట్ల ఆల్టోను 7 సీట్ల జీప్‌గా మార్చేశాడు.. మెకానిక్ క్రియేటివిట
5 సీట్ల ఆల్టోను 7 సీట్ల జీప్‌గా మార్చేశాడు.. మెకానిక్ క్రియేటివిట
తినడానికి తిండి లేని రోజులు.. పక్కింట్లో అన్నం కోసం చూశా..
తినడానికి తిండి లేని రోజులు.. పక్కింట్లో అన్నం కోసం చూశా..
ఓయో హోటల్‌కు వచ్చి విగతజీవిగా మారిన యువతి!
ఓయో హోటల్‌కు వచ్చి విగతజీవిగా మారిన యువతి!
గోల్డ్ లోన్లకు ఎందుకంత క్రేజ్? ఇప్పుడు వాళ్లు కూడా బంగారం తాకట్టు
గోల్డ్ లోన్లకు ఎందుకంత క్రేజ్? ఇప్పుడు వాళ్లు కూడా బంగారం తాకట్టు
గోల్డ్ మెడల్ కోసం పోరు.. మరికొద్దిసేపట్లో మ్యాచ్..
గోల్డ్ మెడల్ కోసం పోరు.. మరికొద్దిసేపట్లో మ్యాచ్..
ఆదిలాబాద్ రిమ్స్‌‌లో ఘోర ప్రమాదం.. ఏసీ పేలి ఇద్దరు చిన్నారుల మృతి
ఆదిలాబాద్ రిమ్స్‌‌లో ఘోర ప్రమాదం.. ఏసీ పేలి ఇద్దరు చిన్నారుల మృతి