AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nasal Vaccine: కొత్త వేరియంట్‌పై అలర్ట్‌.. నాసిక వ్యాక్సిన్‌కు కేంద్రం ఆమోదం

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి బుసలు కొట్టేందుకు సిద్ధమవుతోంది. చైనాలోని వ్యూహన్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్త కొత్తవేరియంట్లతో..

Nasal Vaccine: కొత్త వేరియంట్‌పై అలర్ట్‌.. నాసిక వ్యాక్సిన్‌కు కేంద్రం ఆమోదం
Nasal Vaccine
Subhash Goud
|

Updated on: Dec 23, 2022 | 1:06 PM

Share

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి బుసలు కొట్టేందుకు సిద్ధమవుతోంది. చైనాలోని వ్యూహన్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్త కొత్తవేరియంట్లతో దేశంలో ఫోర్త్‌వేవ్‌ వచ్చే అవకాశాలున్నాయని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తం కావాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఫార్మ కంపెనీ అయిన భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన రెండు చుక్కల నాసికా టీకాకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

దేశంలో నిర్వహిస్తున్న టీకాఇ కార్యక్రమంలో భాగంగా ఇది శనివారం నుంచి అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈ చుక్కల టీకా ప్రైవేటు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండనుంది. అప్పటికే కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలు తీసుకున్నవారు ఈ నాసికా టీకాను హెటిరోలాగస్‌ బూస్టర్‌గా తీసుకోవచ్చని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే భారత్‌ బయోటెక్‌ డెవలప్‌ చేసిన ఈ చుక్కల మందు టీకా ఇన్‌కొవాక్‌ను బూస్టర్‌ డోసుగా వినియోగించేందుకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) నవంబర్‌లో అత్యవసర అనుమతి ఇచ్చింది. ఇప్పుడు దీనికి కేంద్రం ఆమోదం లభించగా.. శుక్రవారం సాయంత్రం నుంచి కొవిన్‌ ప్లాట్‌ఫాంలో అందుబాటులోకి రానుంది. ఈ టీకాను 18 ఏళ్ల దాటిన వారు ఉపయోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.

కొత్త కేసులు..

ప్రపంచ వ్యాప్తంగా నమోదు అవుతున్న కేసుల్లో 81.2 శాతం కొత్త కేసులు కేవలం పది దేశాల్లోనే వెలుగు చూస్తున్నాయని, ఇందులో జపాన్‌ ముందు వరుసలో ఉందని కేంద్రం తెలిపింది. కొత్త కేసులు నమోదువుతున్న నేపథ్యంలో కేంద్రం ముందస్తు చర్యలు చేపడుతోంది. కరోనా కేసులు పెరగకుండా చర్యలు చేపడుతోంది. అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
TV9 సమ్మిట్‌లో పలు అంశాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన మోదీ ..
TV9 సమ్మిట్‌లో పలు అంశాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన మోదీ ..
నారింజ పండు.. పోషకాలు మెండు.. లాభాలు తెలిస్తే వావ్ అనాల్సిందే..
నారింజ పండు.. పోషకాలు మెండు.. లాభాలు తెలిస్తే వావ్ అనాల్సిందే..
ముంబై ఇండియన్స్‌లో ఆంధ్రా కింగ్.. తోపులైనా తోకముడవాల్సిందే..!
ముంబై ఇండియన్స్‌లో ఆంధ్రా కింగ్.. తోపులైనా తోకముడవాల్సిందే..!
విద్యుత్‌ అక్కర్లేదు.. వైఫై అవసరమే లేదు.. సోలార్‌ సీసీ కెమెరాలు..
విద్యుత్‌ అక్కర్లేదు.. వైఫై అవసరమే లేదు.. సోలార్‌ సీసీ కెమెరాలు..
బోల్డ్ పర్ఫామెన్స్‌లో ఈ అమ్మడిని కొట్టేవారే లేరు గురూ..!!
బోల్డ్ పర్ఫామెన్స్‌లో ఈ అమ్మడిని కొట్టేవారే లేరు గురూ..!!
ఓటర్లుగా కాదు, నాయకులు అవ్వండి..: రామ్‌దేవ్
ఓటర్లుగా కాదు, నాయకులు అవ్వండి..: రామ్‌దేవ్
వాతావరణ శాఖ హెచ్చరిక.. వచ్చే 3 రోజులు పిడుగులతో భారీ వర్షాలు!
వాతావరణ శాఖ హెచ్చరిక.. వచ్చే 3 రోజులు పిడుగులతో భారీ వర్షాలు!
సర్పంచ్ కుటుంబంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించినన యువకుడు
సర్పంచ్ కుటుంబంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించినన యువకుడు
అదిరిపోయే ప్లాన్‌..కేవలం రూ.1234 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ
అదిరిపోయే ప్లాన్‌..కేవలం రూ.1234 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ
ఈ రియల్ 'ధురంధర్' కన్నీటి కథ గురించి తెలుసా? పాపం పాక్ జైలులోనే..
ఈ రియల్ 'ధురంధర్' కన్నీటి కథ గురించి తెలుసా? పాపం పాక్ జైలులోనే..