AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Strain Virus: కలవరపెడుతున్న కొత్త రకం స్ట్రెయిన్‌ వైరస్‌.. భారత్‌లో 102కు చేరిన పాజిటివ్‌ కేసుల సంఖ్య

Strain virus: భారత్‌లో కొత్త రకం కరోనా కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. ఈ కొత్త రకం స్ట్రెయిన్‌ వైరస్‌ కేసుల సంఖ్య 102కు...

Strain Virus: కలవరపెడుతున్న కొత్త రకం స్ట్రెయిన్‌ వైరస్‌.. భారత్‌లో 102కు చేరిన పాజిటివ్‌ కేసుల సంఖ్య
Subhash Goud
|

Updated on: Jan 13, 2021 | 4:57 PM

Share

Strain Virus భారత్‌లో కొత్త రకం కరోనా కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. ఈ కొత్త రకం స్ట్రెయిన్‌ వైరస్‌ కేసుల సంఖ్య 102కు చేరినట్లు తెలిపింది. జనవరి 11న 96గా ఉన్న ఈ కేసులు క్రమంగా 102కు చేరాయి. అయితే పాజిటివ్‌ వచ్చిన వారిని ఆయా రాష్ట్రాల్లో ఒక్కో గదిలో ఐసోలేషన్‌లో ఉంచినట్లు కేంద్రం తెలిపింది. వారితో సన్నిహితంగా ఉన్నవారిని క్వారంటైన్‌లో ఉంచినట్లు పేర్కొంది. అయితే మరి కొందరు ప్రయాణికులు, వారిని కలిసిన వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు కేంద్రం తెలిపింది. వీరి నమూనాలపై జన్యుపరీక్షలు చేస్తున్నామని తెలిపింది.

ఈ స్ట్రెయిన్‌ వైరస్‌ విషయంలో రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తున్నామని కేంద్రం తెలిపింది. దీనిపై పర్యవేక్షణ, పరీక్షలు చేయడం, శాంపిళ్లను ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జెనోమిక్స్‌ కన్సోర్టియం ల్యాబ్‌లకు పంపడంలో రాష్ట్రాలకు కేంద్రం సహకారం అందిస్తుందని వివరించింది.

ఈ యూకే స్ట్రెయిన్‌ వైరస్‌ భారత్‌లోనే కాకుండా జపాన్‌, కెనడా, జర్మనీ, బెబనాన్‌, సింగపూర్‌, డెన్మార్క్‌, నెదర్లాండ్‌, ఆస్ట్రేలియా, ఇటలీ, స్వీడన్‌, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, స్విట్జర్లాండ్‌లకు కూడా వ్యాపించింది. సాధారణ కరోనా వైరస్‌ కంటే త్వరితంగా వ్యాప్తి చెందే ఈ యూకే స్ట్రెయిన్‌ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కేంద్రం సూచిస్తోంది.

Also Read:

New Strain Virus: బ్రెజిల్‌ ప్రయాణికుల్లో మరో కొత్త స్ట్రెయిన్‌ వైరస్‌.. గుర్తించిన జపాన్ ఆరోగ్యశాఖ

ప్రపంచ కరోనా అప్‌డేట్…  ఒక్క రోజులో 6,64,911 పాజిటివ్ కేసులు, 15,809 మరణాలు…