New Strain Virus: బ్రెజిల్‌ ప్రయాణికుల్లో మరో కొత్త స్ట్రెయిన్‌ వైరస్‌.. గుర్తించిన జపాన్ ఆరోగ్యశాఖ

New Strain Virus: ఒక వైపు కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గుముఖం పట్టక ముందే కొత్త కరోనా వైరస్‌ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా కరోనా రూపాంతరం చెందిన...

New Strain Virus: బ్రెజిల్‌ ప్రయాణికుల్లో మరో కొత్త స్ట్రెయిన్‌ వైరస్‌.. గుర్తించిన జపాన్ ఆరోగ్యశాఖ
Follow us

|

Updated on: Jan 11, 2021 | 4:50 PM

New Strain Virus: ఒక వైపు కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గుముఖం పట్టక ముందే కొత్త కరోనా వైరస్‌ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా కరోనా రూపాంతరం చెందిన  కొత్త రకం వైరస్‌ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. కరోనా వైరస్‌ తీవ్రత కొనసాగుతున్న కొద్ది కొత్త రకం స్ట్రెయిన్‌ వైరస్  కేసులు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా బ్రెజిల్‌ నుంచి వచ్చిన వారిలోనూ మరో కొత్త రకం వేరియంట్‌ను గుర్తించినట్లు తాజాగా జపాన్‌ ఆరోగ్యశాఖ వెల్లడించింది. బ్రిటన్, దక్షిణఫ్రికా దేశాల్లో బయపడిన ఈ కొత్త రకం వేరియంట్‌ కంటే భిన్నమైనదని జపాన్‌ ప్రభుత్వం పేర్కొంది. మొత్తం నలుగురిలో కొత్త రకం మ్యుటేషన్ గుర్తించగా, ఈ మూడింటిలో ఒకే రకమైన మ్యుటేషన్‌ ఉన్నట్లు వెల్లడించింది. అయితే ఇప్పటికే బ్రిటన్‌లో నమోదైనస్ట్రెయిన్‌ వైరస్‌‌ ఇతర దేశాలకు వ్యాప్తి చెందుతూ ఆందోళనకు గురి చేస్తోంది.

అయితే ఈ కొత్త రకం తీవ్రత ఎక్కువగా ఉందనడానికి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపింది. వైరస్‌ లక్షణాలతో పాటు దానిపై వ్యాక్సిన్‌ ప్రభావం ఎలా ఉంటుందన్న దానిపై పరిశోధన కొనసాగుతోందని జపాన్‌ జతీయ అంటు వ్యాధుల కేంద్రం తెలిపింది. ఇప్పటికే బ్రిటన్‌లో వెలుగు చూసిన కొత్త రకం వైరస్‌ సహా ఇప్పటి వరకు మొత్తం నాలుగు రకాల వైరస్‌లు గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వీటిలో బ్రిటన్‌ వేరియంట్ అత్యంత తీవ్రతతో వ్యాపిస్తున్నట్లు నిపుణులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక భారత్‌లోనూ ఈ కొత్తరకం వైరస్‌ కేసుల సంఖ్య 90 దాటేసింది.

కరోనా వైరస్‌ తీవ్రతకు బ్రెజిల్‌ గజగజ వణికిపోతోంది. ఇప్పటికే అక్కడ 80 లక్షల మందిలో వైరస్‌ బయటపడగా, 2 లక్షల మంది మృత్యువాత పడ్డారు. దీంతో అక్కడి ప్రజలకు కరోనా వ్యాక్సిన్‌ అందించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అయితే జపాన్‌లో ఇప్పటి వరకు 30 మందికి బ్రిటన్‌, దక్షిణాఫ్రికా వేరియంట్లను గుర్తించారు. కొత్త రకం కరోనా వేగంగా వ్యాపిస్తుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించారు. టోక్యో నగరంలో అత్యవసర పరిస్థితిని విధించారు. ఇక ఆ దేశంలో ఇప్పటి వరకు 2,80,000 కరోనా కేసులు నమోదు కాగా, వీరిలో 4 వేల మంది మరణించారు. ఇందులో భాగంగా భారత్‌లో తయారవుతున్న కొవిషీల్డ్‌ వ్యాక్సిన్ 20 లక్షల డోసులు కావాలని బ్రెజిల్‌ కోరింది. ఇక్కడి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఆటంకం లేకుండానే తమకు 20 లక్షల డోసులు పంపించాలని బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు.

Also Read: రూపాంతరం చెందుతున్న కరోనా స్ట్రెయిన్స్.. సౌతాఫ్రికా మ్యుటేషన్‌ కూడా దేశంలోకి ఎంట్రీ

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు