రూపాంతరం చెందుతున్న కరోనా స్ట్రెయిన్స్.. సౌతాఫ్రికా మ్యుటేషన్ కూడా దేశంలోకి ఎంట్రీ
రూపాంతరం చెందుతున్న కరోనా స్ట్రెయిన్స్ గడగడలాడిస్తున్నాయి. బ్రిటన్ వేరియంట్‌తోనే సతమతమవుతుండగా.. సౌతాఫ్రికా మ్యుటేషన్ కూడా దేశంలోకి ఎంట్రీ ఇచ్చింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌కు..

Strain Virus : రూపాంతరం చెందుతున్న కరోనా స్ట్రెయిన్స్ గడగడలాడిస్తున్నాయి. బ్రిటన్ వేరియంట్‌తోనే సతమతమవుతుండగా.. సౌతాఫ్రికా మ్యుటేషన్ కూడా దేశంలోకి ఎంట్రీ ఇచ్చింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌కు చెందిన ముగ్గురిలో దక్షిణాఫ్రికా స్ట్రెయిన్‌ను గుర్తించారు. మొత్తం 7 వందల శాంపిళ్లలో ముగ్గురిలో ఈ వైరస్ బయటపడింది. మెగా వ్యాక్సినేషన్‌కు సిద్ధమవుతున్న ఈ సమయంలో కొత్త రకం కరోనా ఆందోళన కలిగిస్తోంది. ఈ వేరియంట్‌ను 484గా పిలుస్తున్నారు.
బ్రిటన్ వేరియంట్ కంటే ఈ రకం వైరస్ మరింత ప్రమాదకరమని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. కరోనాను అడ్డుకునే యాంటీబాడీస్‌ను కూడా ఈ కొత్త వేరియంట్ తట్టుకుంటుందని చెబుతున్నారు. దీంతో ప్రస్తుతమున్న వ్యాక్సిన్స్ ఈ న్యూ స్ట్రెయిన్స్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలావుంటే.. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తున్న సమయంలో.. రూపంలో కోవిడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే బ్రిటన్, దక్షిణాఫ్రికా, అమెరికాలో రూపం మార్చుకున్న మహమ్మారిని గుర్తించారు. తాజాగా జపాన్‌లో వీటన్నింటికీ భిన్నమైన మరో వైరస్‌ను నిర్ధారించారు.
ఓవైపు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటుంటే.. వెలుగులోకి వస్తున్న కరోనా వైరస్ కొత్త రకాలు ప్రజల్ని కలవరపెడుతున్నాయి.బ్రెజిల్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల్లో ఈ వైరస్‌ను గుర్తించినట్లు జపాన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది.