AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pooja Hegde: నా ఫ్యామిలీ ప్రెజర్ చేస్తున్నారు.. కానీ అది పెళ్లి గురించి కాదంటున్న పూజా హెగ్డే ..

తెలుగు సినీపరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది పూజా హెగ్డే. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. కొన్నాళ్లుగా వరుస డిజాస్టర్స్ అందుకుంది. దీంతో నెమ్మదిగా ఆమె క్రేజ్ తగ్గిపోయింది.

Pooja Hegde: నా ఫ్యామిలీ ప్రెజర్ చేస్తున్నారు.. కానీ అది పెళ్లి గురించి కాదంటున్న పూజా హెగ్డే ..
Pooja Hegde
Rajeev Rayala
|

Updated on: Apr 17, 2025 | 7:24 AM

Share

హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు కొన్ని సంవత్సరాల క్రితం వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిందీ అందాల తార. తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస హిట్ చిత్రాలను అందించిన ఘనత పూజా హెగ్డేకి దక్కింది. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తదితర తెలుగు స్టార్ నటులందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ కాలం గిర్రున తిరిగింది. గత మూడు సంవత్సరాలుగా పూజా హెగ్డే ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు. వరుసగా హిట్ సినిమాలు, బ్లాక్ బస్టర్లు ఇచ్చిన ఆ నటి ఇప్పుడు చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు.. కానీ తమిళ్, హిందీ సినిమాల్లో మాత్రం బిజీగా ఉంది.

ఇది కూడా చదవండి : Prabhas: ఆ రోజు నాకు ఫస్ట్ టైమ్ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి.. ఎమోష్నలైన ప్రభాస్

ఇటీవలే ఓ హిందీ సినిమాలోనూ నటించింది షాహిద్ కపూర్ హీరోగా నటించిన దేవా సినిమా మొన్నీమధ్య విడుదలైంది. కానీ ఆ సినిమా కూడా దారుణంగా నిరాశపరిచింది. ప్రస్తుతమ్స్ సూర్య సరసన రెట్రో సినిమాలో నటిస్తుంది ఈ అమ్మడు. ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టింది చిత్ర యూనిట్. ఈ క్రమంలో పూజా హెగ్డే తెలుగులోనూ పలు ఇంటర్వ్యూలు ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :తమన్నాను చూసి కుళ్ళుకుంటున్న హాట్ బ్యూటీ.. అలాంటి పోస్ట్ షేర్ చేయడంతో ఫ్యాన్స్ సీరియస్

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు మా ఫ్యామిలీ నుంచి ప్రజర్ ఉంది. నేను కర్ణాటక నుంచి వచ్చాను, నేను తుళు అమ్మాయిని.. కాబట్టి కన్నడ భాషలో సినిమాలు చేయాలనీ నా పేరెంట్స్ అడుగుతున్నారు. ఇప్పటివరకు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేశాను. కన్నడ సినిమా కథలను కూడా కొన్ని విన్నాను. కానీ అవి అంతగా కనెక్ట్ అవ్వలేదు. మంచి కథ దొరికితే తప్పకుండ కన్నడ భాషలో నటిస్తా.. నా పేరెంట్స్ ఎప్పటినుంచో అడుగుతున్నారు. అని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే.  ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..