Horoscope Today: ఆ రాశి వారు ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope (April 17, 2025): మేష రాశి వారికి ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. అధికార యోగం అనుభవించే అవకాశం ఉంది. మిథున రాశి వారికి అధికారులు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహిస్తారు. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

దిన ఫలాలు (ఏప్రిల్ 17, 2025): మేష రాశి వారికి ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉండే అవకాశం ఉంది. మిథున రాశికి చెందిన ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆదాయానికి లోటుండదు కానీ, కొద్దిగా శ్రమ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ అందుతుంది. ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
రాశ్యధిపతి శుక్రుడు లాభ స్థానంలో ఉచ్ఛస్థితిలో పూర్తిగా అనుకూలంగా ఉన్నందువల్ల రోజంతా వైభవంగా సాగిపోతుంది. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. అధికార యోగం అనుభవించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకునే సూచనలున్నాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించడం మంచిది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాలలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. అధికారులు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహిస్తారు. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరగడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఇతర దేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఆస్తి వివాదం పరిష్కారానికి అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండదు. ముఖ్య మైన వ్యవహారాల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. ఇష్టమైన మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. డబ్బు ఇవ్వడం గానీ, తీసుకోవడం గానీ పెట్టుకోవద్దు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆదాయం పెరుగుతుంది కానీ, ఖర్చులు తగ్గడం కష్టమవుతుంది. కొందరు బంధుమిత్రుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం కూడా ఉంది. ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఉద్యోగంలో అధికారులు ఎంతో నమ్మకంతో కొత్త బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. దూరపు బంధువుల్లో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో కూడా లాభాలు వృద్ధి చెందుతాయి. రాదనుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఆచితూచి ఖర్చు చేయడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలను సందర్శిస్తారు. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో పదోన్నతికి బాగా అవకాశం ఉంది. అధికారులకు మీ మీద నమ్మకం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఎటువంటి ప్రయత్నమైనా విజయం సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు తప్పకుండా సఫలమవుతాయి. ఆరోగ్యానికి లోటు ఉండకపోవచ్చు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
రోజంతా చాలావరకు సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో రాబడి వృద్ధి చెందుతుంది. వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. ఆదాయ వృద్ధి కోసం ఎక్కువగా శ్రమపడతారు. సొంత పనుల మీద దృష్టి పెడతారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయ వద్దు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనల మీద ఆధారపడడం మంచిది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేయడం వల్ల ఆర్థికంగా లబ్ది పొందుతారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. బంధువుల్లో కొందరు సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో ఆశించిన పురోగతి ఉంటుంది. పదోన్నతి లభించడం గానీ, జీతభత్యాలు పెరగడం గానీ, రాబడి వృద్ధి చెందడం గానీ జరుగుతుంది. ఆకస్మిక దన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక వ్యవహారాల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగుతుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో అదనపు బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి జీవితం ఉత్సాహంగా, ఆశాజనకంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరిగే సూచనలున్నాయి. స్వల్ప అనారోగ్యంతో ఇబ్బంది పడతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. బంధువుల నుంచి శుభ వార్తలు వింటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృథా ఖర్చుల్ని చాలావరకు తగ్గించుకుంటారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా నెరవేరుతుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో సవ్యంగా పూర్తవుతాయి. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. తోబుట్టువులతో ఓ ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ప్రముఖుల నుంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. అనుకున్న పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. బంధుమిత్రుల వ్యక్తిగత విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది.



