AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశులవారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఏప్రిల్ 16, 2025): మేష రాశి వారు ఆర్థిక విషయాల్లో తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం వైభవంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో ఊహించని పురోగతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను దాటుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశులవారికి రాశిఫలాలు
Horoscope Today 16th April 2025
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 16, 2025 | 5:01 AM

దిన ఫలాలు (ఏప్రిల్ 16, 2025): మేష రాశి వారు ఆర్థిక విషయాల్లో తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం వైభవంగా సాగిపోయే అవకాశముంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో ఊహించని పురోగతికి అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఏలిన్నాటి శని ప్రభావం ప్రారంభమైనందువల్ల ఆర్థిక విషయాల్లో తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. ఉద్యోగంలో కూడా అధికారుల విమర్శలు, వేధింపులకు గురి కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. వృత్తి, వ్యాపారాల మీద ప్రస్తుతానికి ఎక్కువగా ఆశలు పెట్టుకోకపోవడం మంచిది. ధన స్థానంలో గురువు ఉండడం వల్ల ఆదాయానికి లోటుండదు. కుటుంబ జీవితం, పిల్లల చదువులు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

లాభ స్థానంలో రాశ్యధిపతి శుక్రుడు ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల, గురువుతో పరివర్తన చెందినందువల్ల ఉద్యోగ జీవితం వైభవంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

దశమ స్థానంలో రాశ్యధిపతి బుధుడితో ఉచ్ఛ శుక్రుడు కలిసి ఉండడం, లాభ స్థానంలో రవి ఉచ్ఛ పట్టడం వల్ల ఉద్యోగంలో ఊహించని పురోగతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను దాటుతాయి. ఇంటా బయటా అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. సంతాన యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ప్రభుత్వం నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. తండ్రి నుంచి ఆస్తి సంక్రమించే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

భాగ్య స్థానంలోని శని వల్ల వృత్తి, ఉద్యోగాలపరంగా శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంటుంది. భాగ్య స్థానంలో గ్రహాలు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో పాటు, లాభ స్థానంలో గురువు ఉండడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. విదేశీ సంబంధమైన ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల్లో కొత్త పుంతలు తొక్కుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

అష్టమ శనితో పాటు, అష్టమ స్థానంలో గ్రహాల సంఖ్య ఎక్కువగా ఉన్నందువల్ల ఉద్యోగంలో బాధ్య తల నిర్వహణలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యోగం మారడానికి ప్రయత్నించకపోవడం మంచిది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. రాశ్యధిపతి రవి ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. తండ్రి వైపు నుంచి ధన లాభాలు కలుగుతాయి. విదేశీ ప్రయత్నాలు సఫలమవుతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

రాశ్యధిపతి బుదుడు సప్తమ స్థానంలో ఉచ్ఛ శుక్రుడితో కలిసి ఉండడం వల్ల ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. కుటుంబ జీవితంలో అనుకూలతలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధా న్యానికి, ప్రాభవానికి లోటుండదు. అధికార యోగం పట్టే అవకాశం ఉంది. విదేశీ ప్రయత్నాలు సానుకూలపడతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

రాశ్యధిపతి శుక్రుడు ఉచ్ఛ పట్టడంతో పాటు ఆరవ స్థానంలో శని ప్రవేశం వల్ల ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతుంది. ఉద్యోగంలో పదోన్నతి లభించవచ్చు. వృత్తి, వ్యాపారాలు లాభ సాటిగా సాగిపోతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. అనుకున్న పనులు చాలావరకు పూర్తవుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

పంచమ స్థానంలో ఉచ్ఛ శుక్రుడు, షష్ట స్థానంలో ఉచ్ఛ రవి, సప్తమంలో గురువు, భాగ్య స్థానంలో రాశ్యధిపతి కుజుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్నవి, ఆశించినవి చాలావరకు పూర్తవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక, ఆరోగ్య, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు లాభాల పంట పండిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

చతుర్థ స్థానంలో శుక్రుడు, పంచమ స్థానంలో రవి ఉచ్ఛపట్టడం వల్ల మానసిక ప్రశాంతతకు, సుఖ సంతోషాలకు లోటుండదు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆస్తిపాస్తులు, షేర్లు వగైరాల నుంచి వచ్చే ఆదాయం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. రాశ్యధిపతి గురువు షష్టంలో, కుజుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల వృథా ఖర్చులు, ఆర్థిక నష్టాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఈ రాశికి తృతీయ స్థానంలో రాశ్యధిపతి శనితో పాటు, మిత్ర గ్రహాలైన శుక్ర, బుధ, రాహువులు కలిసి ఉండడం, పంచమంలో గురువు సంచారం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యంగా ఆదాయ వృద్ధి ప్రయత్నాలు రెట్టింపు ఫలితాలనిస్తాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లభించకపోవచ్చు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఈ రాశికి ధన స్థానం నాలుగు గ్రహాలతో బలంగా ఉన్నందువల్ల ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంది. ఎటువంటి ఆదాయ ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. మాటకు విలువ పెరుగుతుంది. మీ సలహాలు, సూచనల వల్ల బంధు మిత్రులే కాక అధికారులు కూడా లబ్ధి పొందుతారు. ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. సొంత ఇంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ రాశిలో గ్రహాలు ఎక్కువగా ఉండడంతో పాటు, తృతీయ స్థానంలో రాశ్యధిపతి గురువు సంచారం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల వాతావరణం బాగా మెరుగుపడుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు చాలావరకు విజయం సాధిస్తాయి. కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. బంధుమిత్రుల కారణంగా కొద్దిగా ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది.