Breaking: సినీ లవర్స్‌కు కేంద్రం గుడ్‌న్యూస్.. థియేటర్లలో సీట్ల సామర్ధ్యంపై కీలక నిర్ణయం

Increased Theatre Occupancy: సినీ లవర్స్‌కు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. సినిమా హాళ్లు, థియేటర్లలో ఎక్కువ సీట్లకు..

Breaking: సినీ లవర్స్‌కు కేంద్రం గుడ్‌న్యూస్.. థియేటర్లలో సీట్ల సామర్ధ్యంపై కీలక నిర్ణయం
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 27, 2021 | 8:32 PM

Increased Theatre Occupancy: సినీ లవర్స్‌కు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. సినిమా హాళ్లు, థియేటర్లలో ఎక్కువ సీట్ల బుకింగ్‌కు అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఫిబ్రవరి నెల గైడ్‌లైన్స్‌ను తాజాగా విడుదల చేసింది. అయితే ఎన్ని సీట్లకు అనుమతిస్తుందన్న విషయం మాత్రం కేంద్రం త్వరలో తెలియజేయనుంది. అటు దేశవ్యాప్తంగా స్విమ్మింగ్ పూల్స్ తెరిచేందుకు కూడా కేంద్రం అనుమతించింది. ఈ ఆదేశాలు అన్నీ కూడా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని గైడ్ లైన్స్‌లో పేర్కొంది. అలాగే గతంలో జారీ చేసిన కోవిడ్ మార్గదర్శకాలే ఫిబ్రవరి నెలకు కూడా వర్తిస్తాయని కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.  కాగా, ప్రస్తుతం 50 శాతం సీటింగ్ సామర్ధ్యంతో థియేటర్లు, సినిమా హాళ్లు నడుస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: ఐపీఎల్ వేలం డేట్ ఫిక్స్.. ఆక్షన్‌లోకి 55 మంది ఆటగాళ్లు.. ఆ జట్టులోకి స్టీవ్ స్మిత్.?