Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ వేలం డేట్ ఫిక్స్.. ఆక్షన్‌లోకి 55 మంది ఆటగాళ్లు.. ఆ జట్టులోకి స్టీవ్ స్మిత్.?

IPL 2021: ఐపీఎల్ 14కు సంబంధించిన కార్యాచరణ బీసీసీఐ వేగవంతం చేసింది. ఈ నేపధ్యంలోనే ఫిబ్రవరి 18న ఆటగాళ్ల వేలాన్ని చెన్నైలో నిర్వహించేందుకు...

ఐపీఎల్ వేలం డేట్ ఫిక్స్.. ఆక్షన్‌లోకి 55 మంది ఆటగాళ్లు.. ఆ జట్టులోకి స్టీవ్ స్మిత్.?
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 27, 2021 | 6:41 PM

IPL 2021: ఐపీఎల్ 14కు సంబంధించిన కార్యాచరణ బీసీసీఐ వేగవంతం చేసింది. ఈ నేపధ్యంలోనే ఫిబ్రవరి 18న ఆటగాళ్ల వేలాన్ని చెన్నైలో నిర్వహించేందుకు సిద్దమవుతోంది. ఈ విషయాన్ని ఐపీఎల్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. జనవరి 20వ తేదీతో ఆటగాళ్ల రిటెన్షన్ గడువు ముగియగా.. ఇప్పటికే ఫ్రాంచైజీలు పలువురు ప్లేయర్స్‌ను వదులుకున్న సంగతి తెలిసిందే. ఇక జట్ల మధ్య ఆటగాళ్ల ట్రేడింగ్ విండో ఫిబ్రవరి 4తో ముగియనుంది. కాగా, ప్రస్తుతానికి 55 మంది ఆటగాళ్లు వేలంలోకి అందుబాటులో ఉన్నారు.

ఐపీఎల్ 2021: వేలానికి వచ్చిన ఆటగాళ్ల లిస్టు ఇదే..

కేదార్ జాదవ్, మురళీ విజయ్, హర్భజన్ సింగ్, పియూష్ చావ్లా, మోను సింగ్, అలెక్స్ క్యారీ, కీమో పాల్, తుషార్ దేశ్‌పాండే, సందీప్ లామిచాన్, మోహిత్ శర్మ, జాసన్ రాయ్, గ్లెన్ మాక్స్‌వెల్, షెల్డన్ కాట్రెల్, ముజీబ్ జాద్రాన్, హర్దేష్ విల్జొన్, మిచెల్ మెక్‌క్లెనెగన్, స్టీవ్ స్మిత్, ఆకాష్ సింగ్, అనిరుధ జోషి, అంకిత్ రాజ్‌పుత్, ఓషాన్ థామస్, శశాంక్ సింగ్, టామ్ కుర్రాన్, వరుణ్ ఆరోన్, క్రిస్ మోరిస్, శివం దూబే, ఆరోన్ ఫించ్, ఉమేష్ యాదవ్, మొయిన్ అలీ, పార్థివ్ పటేల్, పవన్ నేగి, ఇసురు ఉదానా , గుర్కీరత్ మనన్, బిల్లీ స్టాన్లేక్, సందీప్ బవనక, ఫాబియన్ అలెన్, సంజయ్ యాదవ్, పృథ్వీరాజ్ యర్రా

ఐపీఎల్‌లో ట్రేడ్ అయిన ఆటగాళ్లు..

ఢిల్లీ జట్టు నుంచి ఆల్-క్యాష్ డీల్ కింద డేనియల్ సామ్స్, హర్షల్ పటేల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. అలాగే రాజస్థాన్ జట్టు నుంచి రాబిన్ ఉతప్పను చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. అటు సీఎస్‌కే స్టీవ్ స్మిత్‌ను కూడా దక్కించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీని ఇండియాలో నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది. అయితే అప్పటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వేదికపై తుది నిర్ణయం తీసుకోనుంది.