
మందుబాబులకు భారీ షాక్ ఇచ్చింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో కొన్ని రకాల మద్యం బ్రాండ్స్ ధరలు పెరగనున్నాయి. విదేశీ మద్యంతో పాటు లోకల్ మందు కూడా ఖరీదైనది కానుంది. అంతేకాదు.. వేసవిలో చిల్ అవుదామనుకున్న బీరు బాబులకు కూడా గట్టి షాకే ఇచ్చింది సర్కార్. బీర్ల ధరలు కూడా పెంచింది ప్రభుత్వం. యూపీ ప్రభుత్వ కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి పెరిగిన మద్యం ధరలు అమల్లోకి వస్తాయి. ప్రభుత్వ అధికారిక సమాచారం ప్రకారం.. మద్యంపై రూ. 5 నుంచి రూ. 50 వరకు పెంచింది.
పెరిగిన మద్యం ధరలు కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి రానున్నాయి. యూపీ కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం ఏప్రిల్ 1 నుంచి దేశీ మద్యం ధరలు బాటిల్‌పై రూ. 20 నుంచి రూ. 50 వరకు పెంచారు. అదే సమయంలో విదేశీ మద్యం బాటిళ్లపై రూ. 150 వరకు పెంచారు.
ఇక బీర్ల ధరలు కూడా పెరిగాయి. రూ.150 ఉన్న బీర్ బాటిల్ ధర రూ.10 పెరిగింది. అంటే ఇప్పటి నుంచి యూపీలో ఒక బీర్ రూ. 160 లభిస్తుందన్నమాట.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..