Agnipath Protest: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు.. ఆ రైల్వే స్టేషన్‌కు రూ.200 కోట్ల నష్టం

|

Jun 18, 2022 | 4:13 PM

Agnipath Protest: అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు ఉవ్వెత్తున ఎగిశాయి. రైల్వే స్టేషన్‌లను టార్గెట్‌ చేసుకున్న ఆందోళనకారులు భారీ విధ్వంసాలకు దిగారు. పెద్ద ఎత్తున..

Agnipath Protest: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు.. ఆ రైల్వే స్టేషన్‌కు రూ.200 కోట్ల నష్టం
Follow us on

Agnipath Protest: అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు ఉవ్వెత్తున ఎగిశాయి. రైల్వే స్టేషన్‌లను టార్గెట్‌ చేసుకున్న ఆందోళనకారులు భారీ విధ్వంసాలకు దిగారు. పెద్ద ఎత్తున నష్టం వాటిల్లేలా చేశారు. రైళ్లకు నిప్పటించి నిరసన తెలిపారు. రైలు పట్టాలపై ఉన్న బోగీలకు నిప్పటించారు. అలాగే పట్టాలపై పార్శిళ్లు, ఫర్నిచర్‌లను ధ్వంసం చేశారు. ఆందోళనకారుల దాడుల కారణంగా ఆయా రైల్వే స్టేషన్‌లకు భారీ ఎత్తున నష్టం వాటిల్లింది. దీంతో ఎక్కడికక్కడ రైళ్లను నిలిపివేసింది రైల్వే శాఖ. నిన్న జరిగిన అల్లర్ల కారణంగా నిలిచిపోయిన రైళ్లు.. ఈ రోజు సాధారణ పరిస్థితులు రావడంతో కొన్ని కొన్ని రైళ్లను పునరుద్దరించారు. ఆందోళనకారుల దాడులతో రంగంలోకి దిగిన పోలీసులు కాల్పులు జరిపారు. సికింద్రాబాద్‌లో ఓ యువకుడు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. అలాగే బీహార్‌లో కూడా చాలా మంది గాయాపడ్డారు.

బీహార్‌ రైల్వే స్టేషన్‌కు రూ.200 కోట్ల నష్టం:

అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో బీహార్‌ రైల్వే స్టేషన్‌కు రూ.200 కోట్ల నష్టం వాటిల్లినట్లు దానాపూర్ రైల్వే డివిజన్ డీఆర్‌ఎల్ ప్రభాత్ కుమార్ తెలిపారు. 50కి పైగా కోచ్‌లు దగ్ధమయ్యాయి. 5 ఇంజన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్లాట్‌ఫారమ్‌లు, కంప్యూటర్లు, ఇతర వస్తువుల వల్ల చాలా నష్టం వాటిల్లినట్లు తెలిపారు. చాలా రైళ్లను రద్దు చేయాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి