
ఉత్తర భారత్‌లో హీట్‌వేవ్ తీవ్రత కొనసాగుతోంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల ప్రజలు బయటకు వచ్చేందుకే జంకుతున్నారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత వల్ల దాదాపు 98 మంది మృతి చెందడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వేసవి కాలం ముగిసి.. జూన్ మాసం గడిచి సగం రోజులైనప్పటికీ ఇంకా చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఎండలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక కూడా పలు రాష్ట్రాలకు ఆలస్యం కావడం కలవరపాటుకు గురిచేస్తోంది.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో రుతుపవనాలు రాయలసీమను తాకినప్పటికీ అక్కడి నుంచి అవి ముందుకు కదలడం లేదు. అక్కడ కూడా చాలా ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతవారణ శాఖ అధిక ఉష్ణోగ్రతలకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించింది. రాబోయే రెండు, మూడు రోజుల పాటు10 రాష్ట్రాల్లో ఇంకా హీట్‌వేవ్ తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది. అందులో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఉండనుందని తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..