జెఎన్ యు ఘటనలో ఏబీవీపీ హస్తం.. ఇదిగో వీడియో సాక్ష్యం !

ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రు యూనివర్సిటీలో ఆదివారం రాత్రి ముసుగులు ధరించిన పలువురు హాస్టళ్లలో ప్రవేశించి విద్యార్థులపై దాడి చేసిన దృశ్యాల తాలూకు వీడియోలు, ఫోటోలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ దాడుల్లో బీజేపీ అనుబంధ సంస్థ అయిన ఏబీవీపీ హస్తం ఉన్నట్టు క్రమేపీ తెలుస్తోంది. జె ఎన్ యు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడైన వికాస్ పటేల్ అనే విద్యార్ధి తన చుట్టూ లాఠీలతో నిలబడి ఉన్న గుంపు మధ్య  కనిపించాడు. ఢిల్లీ పోలీసులు వాడే ఫైబర్ గ్లాస్ లాఠీవంటి […]

జెఎన్ యు ఘటనలో ఏబీవీపీ హస్తం.. ఇదిగో వీడియో సాక్ష్యం !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 06, 2020 | 6:36 PM

ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రు యూనివర్సిటీలో ఆదివారం రాత్రి ముసుగులు ధరించిన పలువురు హాస్టళ్లలో ప్రవేశించి విద్యార్థులపై దాడి చేసిన దృశ్యాల తాలూకు వీడియోలు, ఫోటోలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ దాడుల్లో బీజేపీ అనుబంధ సంస్థ అయిన ఏబీవీపీ హస్తం ఉన్నట్టు క్రమేపీ తెలుస్తోంది. జె ఎన్ యు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడైన వికాస్ పటేల్ అనే విద్యార్ధి తన చుట్టూ లాఠీలతో నిలబడి ఉన్న గుంపు మధ్య  కనిపించాడు. ఢిల్లీ పోలీసులు వాడే ఫైబర్ గ్లాస్ లాఠీవంటి ‘ ఆయుధాన్ని ‘ ఇతగాడు పట్టుకున్నాడు. అతని పక్కనే నీలి, పసుపు రంగు షర్ట్ ధరించిన విద్యార్థిని శివ పూజన్ మండల్ గా గుర్తించారు. ఈ యూనివర్సిటీలో బీఏ ఫస్టియర్ చదువుతున్న ఇతడికి ఏబీవీపీతో లింక్ ఉందట.. ఈ విశ్వవిద్యాలయంలో దాడికి ముందే ఆదివారం మధ్యాహ్నం ఈ ఫోటో తీశారట..మరికొన్ని ఫొటోల్లో లాఠీలు చేతబట్టిన వ్యక్తులతో శివ పూజన్ మండల్ క్యాంపస్ లో ఎంటరవుతున్న దృశ్యాలు ఉన్నాయి. ఆదివారం రాత్రి తీసిన వీడియోలో కూడా మండల్ కనిపించాడు. కాగా- పటేల్, మండల్ ఇద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేశారు. వామపక్ష విద్యార్థులపై జరిపే దాడికి ముందు ఏబీవీపీ సభ్యులు కొందరు వాట్సాప్ ద్వారా పంపుకున్న సందేశాలకు సంబంధించి స్క్రీన్ షాట్ పటేల్ నెంబర్లో కనిపించింది.  ఈ చాటింగ్ లో సంస్కృత విద్యార్ధి అయినయోగేంద్ర భరద్వాజ్, సందీప్ సింగ్ అనే పీహెచ్ డీ స్టూడెంట్ కూడా ‘ పాలుపంచుకున్నారు ‘. భరద్వాజ్ తన ‘ ఖాతా ‘ ను తొలగించినప్పటికీ.. అతని ట్విటర్ ప్రొఫైల్ లో అతడు ఏబీవీపీ సభ్యుడనే స్క్రీన్ షాట్స్ కనిపించాయి. వీరి చాటింగ్ వివరాలు ఇలా ఉన్నాయి.