PM Modi: పెద్దల సభకు ఆ నలుగురు.. స్వయంగా ప్రకటించిన ప్రధాని మోడీ.. విజయేంద్ర ప్రసాద్ సహా..

|

Jul 06, 2022 | 8:46 PM

దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌, సంగీత దర్శకుడు ఇళయరాజా, మాజీ అథ్లెట్‌ పీటీ ఉష, వీరేంద్ర హెగ్డెను రాజ్యసభకు నామినేట్‌ చేస్తునట్టు స్వయంగా ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

PM Modi: పెద్దల సభకు ఆ నలుగురు.. స్వయంగా ప్రకటించిన ప్రధాని మోడీ.. విజయేంద్ర ప్రసాద్ సహా..
Pm Modi Vijayendra Prasad
Follow us on

Four Presidential nominees to Rajya Sabha: దక్షిణాదికి చెందిన నలుగురు ప్రముఖులను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్‌ చేసింది. దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌, సంగీత దర్శకుడు ఇళయరాజా, మాజీ అథ్లెట్‌ పీటీ ఉష, ధర్మస్థల ఆలయానికి చెందిన వీరేంద్ర హెగ్గడే ను రాజ్యసభకు నామినేట్‌ చేస్తునట్టు స్వయంగా ప్రధాని మోదీ బుధవారం రాత్రి ట్వీట్‌ చేశారు. రాష్ట్రపతి కోటాలో వీరంతా నామినేట్ అయ్యారు.

సృజనాత్మకత విషయంలో భారత గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత విజయేంద్రప్రసాద్‌కు దక్కుతుందని ట్వీట్‌ చేశారు. ‘‘వి.విజయేంద్ర ప్రసాద్ దశాబ్దాలుగా సృజనాత్మక ప్రపంచంతో అనుబంధం కలిగి ఉన్నారు. అతని రచనలు భారతదేశం, అద్భుతమైన సంస్కృతిని ప్రతిబింభిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ముద్రను సైతం వేసాయి. రాజ్యసభకు నామినేట్ అయినందుకు ఆయనకు అభినందనలు’’. అంటూ ప్రధాని ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఇళయరాజా సంగీతంతో భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారని మోదీ ట్వీట్‌లో ప్రశంసించారు. తన జీవితాన్ని ఇళయరాజా సంగీతానికి అంకితమిచ్చారని అన్నారు. క్రీడారంగంలో సత్తా చాటిన పీటీ ఉషను రాజ్యసభ సభ్యత్వంతో సత్కరించడం ఆనందంగా ఉందన్నారు మోదీ. కర్నాటకకు చెందిన వీరేంద్ర హెగ్డే కూడా రాజ్యసభకు నామినేట్‌ చేశారు.