ఈమధ్య కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు తీవ్ర కలవరం రేపుతున్నాయి. గతంలో తెలుగు రాష్ట్రాల్లోని ఒక సంస్థకు చెందిన కళాశాల విద్యార్థులే అధిక సంఖ్యలో సూసైడ్ చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశం అయింది. అయితే ఐఐటీల్లో కూడా విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తెలంగాణలోని ఐఐటీల్లో గతంలో చాలా మంది ప్రాణాలు విడిచిన సంఘటనలు మరువక ముందే ఢిల్లీలో మరొకరు ప్రాణ త్యాగానికి ఒడిగట్టాడు. అతి చిన్న వయసులోనే ఇలా ప్రాణాలు కోల్పోతుండటంతో ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తున్నాయి ఈ సంఘటనలు. ఒకరు చదువులో ఒత్తిడి కారణంగా మరణిస్తే.. మరొకరు సీనియర్ల వేధింపులు తాళలేక ప్రాణాలు కోల్పోతున్నారు. ఢిల్లీ ఐఐటీలో 23ఏళ్ల పనవ్ జైన్ ప్రాణాలు కోల్పోవడానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఇంట్లోని వెయిట్ లిఫ్టింగ్ రాడ్‌కు ఉరి వేసుకుని 23ఏళ్ల విద్యార్థి మరణించడంపై కుటుంబ సభ్యులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలోని ఐఐటీలో పనవ్ జైన్ బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం రాత్రి 9 గంటలకు ఈ విద్యార్థి తల్లిదండ్రులు వాకింగ్‌కి వెళ్లి తిరిగి వస్తుండగా పనవ్ జైన్ ఉరి వేసుకున్నట్లు గుర్తించారు. వెంటనే తల్లి పుష్పాంజలి ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మార్గం మధ్యలోనే ఈ పిల్లవాడు మరణించినట్లు డాక్టర్లు నిర్థారించినట్లు పోలీసులకు తెలిపారు. తమ కొడుకు గత కొంత కాలంగా డిప్రెషన్‌కు గురవుతున్నాడని దీనికి సంబంధించి డాక్టర్ల వద్ద చికిత్స కూడా తీసుకున్నట్లు వివరించారు. తన ఇంట్లో లభించిన సూసైడ్ నోట్‌ను పోలీసులకు అందించాడు పనవ్ జైన్ తండ్రి. సూసైడ్ నోట్‌ను చదివిన పోలీసులు తదుపరి విచారణ చేపడతామని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి తల్లిదండ్రులకు తెలిపారు. కారణాలు ఏమైనది ఇంకా వెలుగులోకి రాలేదు. తల్లిదండ్రలు చెబుతున్న దాని ప్రకారం అధిక ఒత్తిడే కారణమని తెలుస్తోంది. ఈ ఒత్తిడికి కారణం ఎవరు, విద్యార్థులా, అధ్యాపకులా తెలియాల్సి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.