ఆజాద్‌ను కాంగ్రెస్ రాజ్యసభకు నామినేట్ చేయకపోతే.. మేం చేస్తాం: కేంద్ర మంత్రి అథవాలే సంచలన వ్యాఖ్యలు
Ramdas Athawale on Ghulam Nabi Azad: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ గురించి రాజ్యసభలో భావోద్వేగంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి15తో ఆజాద్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఆయన సేవలను..
Ramdas Athawale on Ghulam Nabi Azad: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ గురించి రాజ్యసభలో భావోద్వేగంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి15తో ఆజాద్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఆయన సేవలను తలుచుకొని మోదీ కంటతడిపెట్టారు. ఈ క్రమంలోనే ఆజాద్ విషయంలో కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల్లోనే రాజ్యసభ సభ్యునిగా పదవీ విరమణ చేయనున్న ఆజాద్ గురించి మాట్లాడుతూ.. రాజ్యసభకు మళ్లీ నామినేట్ చేయడానికి సిద్ధమంటూ అథవాలే పేర్కొన్నారు.
‘‘మీరు కచ్చితంగా మరలా సభలోకి ప్రవేశించాలి.. కాంగ్రెస్ మిమ్మల్ని రాజ్యసభకు నామినేట్ చేయకపోతే.. మేం చేయడానికి సిద్ధం.. రాజ్యసభకు మీ అవసరం ఉంది’’ అంటూ అథవాలే వ్యాఖ్యానించారు. రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేతగా గులాంనబీ ఆజాద్ వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 15తో ఆయన రాజ్యసభ పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో అథవాలే ఈ ప్రకటన చేయడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది.
Also Read: