ముఖేశ్ అంబానీ కుటుంబం ఐటీ నోటీసులు అందుకున్నారా..?

ముఖేశ్ అంబానీ కుటుంబం  ఐటీ నోటీసులు అందుకున్నారా..?

దేశీయ మార్కెట్ దిగ్గజం రిలయన్స్ కెంపెనీ ఛైర్మన్ ముకేశ్ అంబానీకి ముంబై ఇన్‌కమ్‌ టాక్స్ శాఖ నోటీసులు జారీ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది మార్చి 28న నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అనేక దేశాల నుంచి వచ్చిన సమాచారంపై దర్యాప్తు జరిపిన తర్వాత ఇన్‌కమ్‌టాక్స్ ఈ నోటీసులు ఇష్యూ చేసింది. బ్లాక్‌మనీ యాక్ట్ 2015 కింద ఈ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ముకేశ్ అంబానీ కుటుంబానికి సభ్యులైన అనంత్ అంబానీ, ఆకాష్ అంబానీ, ఇషా […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 14, 2019 | 7:08 PM

దేశీయ మార్కెట్ దిగ్గజం రిలయన్స్ కెంపెనీ ఛైర్మన్ ముకేశ్ అంబానీకి ముంబై ఇన్‌కమ్‌ టాక్స్ శాఖ నోటీసులు జారీ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది మార్చి 28న నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అనేక దేశాల నుంచి వచ్చిన సమాచారంపై దర్యాప్తు జరిపిన తర్వాత ఇన్‌కమ్‌టాక్స్ ఈ నోటీసులు ఇష్యూ చేసింది. బ్లాక్‌మనీ యాక్ట్ 2015 కింద ఈ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ముకేశ్ అంబానీ కుటుంబానికి సభ్యులైన అనంత్ అంబానీ, ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ, నీతా అంబానీలు అనేక దేశాల్లో విదేశీ ఆదాయాన్ని, ఆస్తులను వెల్లడించలేదని సమాచారం.

మనదేశంలో పలువురు వ్యాపారవేత్తలపై దర్యాప్తు ప్రారంభించిన తర్వాత, 2011లో హెచ్‌ఎస్‌బీసీ జెనీవాలో 700 మంది భారతీయులకు ఖాతాలున్న వివరాలు భారత ప్రభుత్వానికి లభించాయి. ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ( ఐసీఐజే) తన నివేదికలో హెచ్ఎస్‌బీసీ జెనీవాలో ఖాతాదారుల సంఖ్య 1,195గా తెలిపింది. అయితే 601 మిలియన్ డాలర్ల బ్యాలెన్స్‌తో 14 హెచ్‌ఎస్‌బిసి జెనీవా బ్యాంక్ ఖాతాల క్లస్టర్‌‌లో అంబానీ కుటుంబం పేర్లు కూడా ఉన్నట్టుగా ఆ నివేదికలో వెల్లడించింది. అయితే దీనిపైనే దర్యాప్తు జరిపి ఆదాయపు పన్నుశాఖ టాక్స్ యాక్ట్ 2015, సెక్షన్ 10 లోని సబ్ సెక్షన్ (ఐ) ప్రకారం ఈ నోటీసులు లిచ్చినట్టు నివేదిక పేర్కొంది.

ఇదిలా ఉంటే రిలయన్స్ సంస్ధ ఛైర్మన్ తరపున కంపెనీ ప్రతినిధి ఈ నివేదికలను ఖండించారు. ఇప్పటివరకు తమకు ఐటీ శాఖ నుంచి ఎటువంటి నోటీసులు అందలేదని తెలిపారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu