దేశంలోనే అత్యధిక జరిమానా వేసింది.. ఎక్కడంటే.?

రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా కేంద్రం అమలు చేసిన కొత్త మోటారు వెహికిల్ చట్టం చుక్కలు చూపిస్తోంది. చట్టంలోని లూప్ హోల్స్ వెతికి మరీ ట్రాఫిక్ పోలీసులు విధిస్తున్న భారీ జరిమానాలు వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. వందలు, వేలు అయితే పర్లేదు గానీ.. లక్షల్లో జరిమానాలు విధించడంతో ప్రజల జేబులు చిల్లు కావాల్సి వస్తోంది. ఇది ఇలా ఉండగా కొందరు ఈ ఫైన్లను చెల్లించలేక వారి వాహనాన్ని పోలీసుల దగ్గరే వదిలేస్తున్నారు. మొన్నటికి మొన్న ఓ ట్రక్‌కు విధించిన రూ. […]

దేశంలోనే అత్యధిక జరిమానా వేసింది.. ఎక్కడంటే.?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 14, 2019 | 8:32 PM

రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా కేంద్రం అమలు చేసిన కొత్త మోటారు వెహికిల్ చట్టం చుక్కలు చూపిస్తోంది. చట్టంలోని లూప్ హోల్స్ వెతికి మరీ ట్రాఫిక్ పోలీసులు విధిస్తున్న భారీ జరిమానాలు వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. వందలు, వేలు అయితే పర్లేదు గానీ.. లక్షల్లో జరిమానాలు విధించడంతో ప్రజల జేబులు చిల్లు కావాల్సి వస్తోంది. ఇది ఇలా ఉండగా కొందరు ఈ ఫైన్లను చెల్లించలేక వారి వాహనాన్ని పోలీసుల దగ్గరే వదిలేస్తున్నారు. మొన్నటికి మొన్న ఓ ట్రక్‌కు విధించిన రూ. 2లక్షలు ఫైన్ మరిచిపోక ముందే.. లారీకి ఏకంగా రూ.6 లక్షల ఫైన్ విధించారు ట్రాఫిక్ పోలీసులు.

దేశంలోనే ఓ బండికి ఇంత పెద్ద మొత్తంలో భారీ జరిమానా విధించడం ఇదే తొలిసారి. నాగాలాండ్‌కు చెందిన (NL-08 7079) నెంబర్ కలిగిన లారీని రవాణా అధికారులు సాంబలాపూర్‌లో చెక్ చేయగా.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిందని తేలింది. రూ. 6 లక్షల 53 వేల 100 రూపాయల ఫైన్ కట్టాలంటూ ఓ రసీదును డ్రైవర్ చేతిలో పెట్టారు. అయితే ఈ ఫైన్‌ను కొత్త మోటారు వాహనాల చట్టం అమలులోకి రాకముందు.. ఆగష్టు 10వ తేదీన వేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన రసీదు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఇక ఈ 6 లక్షల 53 వేలలో.. జూలై 21, 2014 నుంచి సెప్టెంబర్ 30, 2019 వరకు చెల్లించని రోడ్డు టాక్స్ గానూ రూ. 6,40,500 విధించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమించినందుకు రూ.500, పొల్యూషన్ లేనందుకు రూ. 1000, అధికమంది ప్రయాణికులను గూడ్స్ వాహనంలో తీసుకెళ్ళినందుకు గానూ రూ.5000, ఆ తర్వాత వాహన డాక్యూమెంట్స్ లేనందుకు రూ.5000, ఇన్సూరెన్స్ లేకపోవటంతో రూ.1000 ఫైన్‌గా విధించారు.

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్