‘హౌడీమోడీ’ ఈవెంట్.. పొంచి ఉన్న తుపాను ముప్పు !

టెక్సాస్ లోని హూస్టన్ లో ప్రధాని మోదీ గౌరవార్థం ‘ హౌడీమోడీ ‘ పేరిట నిర్వహించనున్న మెగా ఈవెంట్ కి కౌంట్ డౌన్ మొదలైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ కార్యక్రమంలో ఆయనతో కలిసి ఒకే వేదికను పంచుకోనుండగా.. కనీవినీ ఎరుగని రీతిలో 50 వేల మందికి పైగా ఇండియన్ అమెరికన్లు ఇందులో పాల్గొనబోతున్నారు. అయితే అత్యంత ఆర్భాటంగా జరగనున్న ఈ కార్యక్రమానికి ‘ ఇమెల్డా ‘ తుపాను ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే ఈ ఈవెంట్ […]

'హౌడీమోడీ' ఈవెంట్.. పొంచి ఉన్న తుపాను ముప్పు !
Follow us

|

Updated on: Sep 22, 2019 | 1:50 PM

టెక్సాస్ లోని హూస్టన్ లో ప్రధాని మోదీ గౌరవార్థం ‘ హౌడీమోడీ ‘ పేరిట నిర్వహించనున్న మెగా ఈవెంట్ కి కౌంట్ డౌన్ మొదలైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ కార్యక్రమంలో ఆయనతో కలిసి ఒకే వేదికను పంచుకోనుండగా.. కనీవినీ ఎరుగని రీతిలో 50 వేల మందికి పైగా ఇండియన్ అమెరికన్లు ఇందులో పాల్గొనబోతున్నారు. అయితే అత్యంత ఆర్భాటంగా జరగనున్న ఈ కార్యక్రమానికి ‘ ఇమెల్డా ‘ తుపాను ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే ఈ ఈవెంట్ జరగనున్న హూస్టన్ ప్రాంతంలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ తుపాను కారణంగా ఈ నెల 19 న (గురువారం) దాదాపు 900 విమానాలను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేయగా.. పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి. హూస్టన్ లో ‘ ఇంటర్ స్టేట్ 10 ‘ వంటి చోట్ల రోడ్లను రెండువైపులా మూసివేశారు. టెక్సాస్ లోని హ్యామ్ షైర్ లో గల ఓ చర్చి ప్రాంతం శుక్రవారం రాత్రి జలమయం కాగా.. కొంతమందిని బోట్లలో సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించవలసి వచ్చింది. తుపాను ప్రభావం వల్ల కొన్ని చోట్ల చెట్లు కూలిపోయాయి. ఇద్దరు మరణించారు. వరద నీటిలో కార్లు ఎటూ వెళ్లలేక మొరాయించగా వాటిలో చిక్కుకున్న వందలాది మందిని కూడా రెస్క్యూ బృందాలు బోట్లలో తరలించాయి. వేలాది ప్రజల ఇళ్లలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. భారీ వర్షం కొంత మందగించినప్పటికీ,, ఆకస్మిక వరదలు వచ్ఛే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పైగా ఈ ఈవెంట్ జరిగే వెన్యూ వద్ద కాశ్మీరీ వేర్పాటువాదులు, ఖలిస్థాన్ ,మిలిటెంట్లు, సానుభూతిపరులు, పాకిస్తాన్ మద్దతుదారులు నిరసన ప్రదర్శన జరుపవచ్చునని అధికారులకు సమాచారం అందింది. ఈ దృష్ట్యా అక్కడ అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్