Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టెక్సాస్ వర్సెస్ జమ్మూకాశ్మీర్.. అందుకే మోదీ …..

‘ హౌడీమోడీ ‘ ఈవెంట్ కి టెక్సాస్ లోని హూస్టన్ సిటీనే ప్రధాని మోదీ ఎందుకు ఎంచుకున్నారు ? దీని వెనుక ఓ అంతర్జాతీయ ‘ బంధమే.. పోలికలే ‘ కనిపిస్తున్నాయి. అమెరికాలోని ఈ రాష్ట్రానికి, జమ్మూకాశ్మీర్ కు మధ్య లింక్ ఉండడమే కారణమట. టెక్సాస్ అమెరికాలో విలీనమైతే.. కాశ్మీర్ ఇండియాలో విలీనమైంది. అందువల్లే మోదీ ఈ రాష్ట్రాన్ని ఎంచుకున్నట్టు చెబుతున్నారు. ఆయన హూస్టన్ నగరాన్ని సందర్శించగానే.. అక్కడి కాశ్మీరీ పండిట్లు వచ్చి ఆయనకు గ్రీటింగ్స్ చెప్పారు. […]

టెక్సాస్ వర్సెస్ జమ్మూకాశ్మీర్.. అందుకే మోదీ .....
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Sep 22, 2019 | 4:21 PM

‘ హౌడీమోడీ ‘ ఈవెంట్ కి టెక్సాస్ లోని హూస్టన్ సిటీనే ప్రధాని మోదీ ఎందుకు ఎంచుకున్నారు ? దీని వెనుక ఓ అంతర్జాతీయ ‘ బంధమే.. పోలికలే ‘ కనిపిస్తున్నాయి. అమెరికాలోని ఈ రాష్ట్రానికి, జమ్మూకాశ్మీర్ కు మధ్య లింక్ ఉండడమే కారణమట. టెక్సాస్ అమెరికాలో విలీనమైతే.. కాశ్మీర్ ఇండియాలో విలీనమైంది. అందువల్లే మోదీ ఈ రాష్ట్రాన్ని ఎంచుకున్నట్టు చెబుతున్నారు. ఆయన హూస్టన్ నగరాన్ని సందర్శించగానే.. అక్కడి కాశ్మీరీ పండిట్లు వచ్చి ఆయనకు గ్రీటింగ్స్ చెప్పారు. కాశ్మీర్ కు స్వయం నిర్ణయాధికారాన్ని కల్పించేందుకు ఉద్దేశించిన 370 అధికరణాన్ని రద్దు చేసినందుకు వారు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. భారత దేశానికి స్వాతంత్య్రం వఛ్చిన సందర్భంలో అప్పటికి ఇంకా దేశ విభజన జరగకముందు జమ్మూకాశ్మీర్ భారత్ లో ఎలా అంతర్భాగం కాదో.. అలాగే అమెరికా ఏర్పడినప్పుడు టెక్సాస్ కూడా ఆ దేశంలో ఓ భాగం కాదు. 1836 వరకు ఈ రాష్ట్రం మెక్సికో లో భాగంగా ఉండేది. అయితే నాడు అక్కడ తిరుగుబాటు జరిగిన ఫలితంగా రిపబ్లిక్ ఆఫ్ టెక్సాస్ ఏర్పడింది. అప్పుడే స్వతంత్రతను ప్రకటించుకుంది. అమెరికాలో పుట్టి.. మెక్సికన్ టెక్సాస్ లో సెటిలైన శ్యామ్యూల్ హూస్టన్ నాయకత్వంలో ఈ ‘ ఘటనలు ‘ జరిగాయి. 1830 ప్రాంతంలో అమెరికాలో కొద్దికాలం రాజకీయ అనిశ్చితి ఏర్పడిన అనంతరం జరిగిన పరిణామమది. యుఎస్ లో ఎంతో పాపులర్ అయి టెక్సాస్ తో ‘ సమాన హోదా ‘ దక్కించుకున్న హూస్టన్ ని శ్యామ్యూల్ హూస్టన్ పేరుతోనే వ్యవహరిస్తూ వచ్చారు. అమెరికాలో టెక్సాస్ విలీనమయ్యేందుకు ఆయన ఆధ్వర్యంలో రిపబ్లిక్ ఆఫ్ టెక్సాస్ ఓ తీర్మానాన్ని ఆమోదించింది.

అయితే  అమెరికాలోని ప్రధాన పార్టీలు తమ దేశంలో ఈ విలీనాన్ని వ్యతిరేకించాయి. కానీ హఠాత్తుగా అప్పటి అధ్యక్షుడు జాన్ టైలర్ యుఎస్ లో టెక్సాస్ విలీనానికి మద్దతు ప్రకటించారు. 1844 లో అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో అది ఓ ప్రధాన సమస్య అయింది. చివరకు ఆయన తరువాత అధ్యక్షుడైన జేమ్స్ పోక్.. హయాంలో.. అమెరికాలో టెక్సాస్ విలీనాన్ని ఆమోదించారు. అది ఆ దేశంలో 28 వ రాష్ట్రంగా అవతరించింది. 1947 లో భారత స్వాతంత్య్రం తరువాత విభజన జరిగినప్పుడు టెక్సాస్ మాదిరే జమ్మూకాశ్మీర్ కూడా భారత్ లో అంతర్భాగమైంది. ఇలా టెక్సాస్ కు, కాశ్మీర్ రాష్ట్రానికి మధ్య పోలికలను ఈ సందర్భంగా విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.