ఆధార్‌కు దరఖాస్తు చేసుకోవడమెలా..!: పది పాయింట్లు

భారతదేశంలో నివసించే ప్రతి పౌరుడికి ఆధార్ అన్నది చాలా కీలకమైన డాక్యుమెంట్. 12 నంబర్లు కలిగి ఉన్న ఈ ఆధార్ కార్డు వలన ధ్రువీకరణతో పాటు ప్రభుత్వ పథకాలు, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్స్న్ దాఖలు, బ్యాంక్ వంటి సేవలను మనం ఈజీగా ఉపయోగించుకోవచ్చు. అందుకే ప్రతి ఒక్కరు ఆధార్‌ కార్డును కలిగి ఉండాలంటూ భారత ప్రభుత్వం అందరిలోనూ సామాజిక స్పృహను కల్పిస్తూ వస్తోంది. ఇక ఈ ఆధార్ వలన కలిగే ప్రయోజనాలు ఎన్నో. ప్రభుత్వ పథకాల ఫలాలు […]

ఆధార్‌కు దరఖాస్తు చేసుకోవడమెలా..!: పది పాయింట్లు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 14, 2019 | 3:12 PM

భారతదేశంలో నివసించే ప్రతి పౌరుడికి ఆధార్ అన్నది చాలా కీలకమైన డాక్యుమెంట్. 12 నంబర్లు కలిగి ఉన్న ఈ ఆధార్ కార్డు వలన ధ్రువీకరణతో పాటు ప్రభుత్వ పథకాలు, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్స్న్ దాఖలు, బ్యాంక్ వంటి సేవలను మనం ఈజీగా ఉపయోగించుకోవచ్చు. అందుకే ప్రతి ఒక్కరు ఆధార్‌ కార్డును కలిగి ఉండాలంటూ భారత ప్రభుత్వం అందరిలోనూ సామాజిక స్పృహను కల్పిస్తూ వస్తోంది. ఇక ఈ ఆధార్ వలన కలిగే ప్రయోజనాలు ఎన్నో. ప్రభుత్వ పథకాల ఫలాలు పొందాలంటే ఇప్పుడు ఆధార్ తప్పనిసరిగా మారింది. అందుకే ప్రతి ఒక్కరు ఆధార్‌ను తీసుకోవడమే మంచిది.

ఆధార్‌కు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే:

  • మీ దగ్గర్లో ఉన్న ఆధార్ సెంటర్లో గానీ ఆన్‌లైన్‌లో గానీ(www.uidai.gov.in) ఆధార్‌ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఆధార్‌కు సంబంధించిన ఓ అప్లికేషన్‌ను నింపాలి. ఆ సమయంలో మన అడ్రస్ ప్రూఫ్‌(డ్రైవింగ్ లైసెన్స్, కరెంట్ బిల్, ఓటర్ ఐడీ) చూపించాల్సి ఉంటుంది.
  • అది పూర్తైన తరువాత మీ బయోమెట్రిక్ డేటాను కూడా ఇవాల్సి ఉంటుంది(అందులో భాగంగా మీ చేతి వేళ్లను, ఐరిస్ స్కాన్‌ బయోమెట్రిక్ ద్వారా సేకరిస్తారు).
  • ఈ సందర్భంగా మీ ఫొటోను కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
  • ఆ తరువాత మీకు ఒక అక్‌నాలెడ్జ్‌మెంట్ స్లిప్‌ను ఇస్తారు.
  • అందులో ఉన్న 14 అంకెల నెంబర్ ద్వారా మీ ఆధార్ స్టేటస్‌ను మీరు చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. లేకపోతే మొబైల్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
  • సాధారణంగా ఆధార్‌ కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారికి, అది పోస్ట్ ద్వారా పంపబడుతుంది.
  • పోస్ట్‌లో రావడం ఆలస్యమైతే.. ఆధార్ సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి కార్డును నేరుగా ఆన్‌లైన్ ‌నుంచి పొందవచ్చు
  • చిన్న పిల్లలకైతే బర్త్‌ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి.
  • ఆధార్‌లో ఏదైనా మార్పులు చేయాలనుకుంటే ఏదైనా మీ సేవ సెంటర్‌కు వెళ్లి సంబంధిత డాక్యుమెంట్లతో తప్పులను సరిదిద్దుకోవచ్చు.