క్లైయింట్ కారులో ఫ్రెండ్‌తో డిన్నర్‌కి వెళ్లాడు.. రాత్రి 12 గంటలకు రిటర్న్ అవుతుండగా..
బెంగళూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. హోస్కోట్ వద్ద శాటిలైట్ టౌన్ రింగ్ రోడ్డుపై అతివేగంతో వచ్చిన మెర్సిడెస్-బెంజ్ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో రిజ్వాన్ (30), సజ్జియా (28) అక్కడికక్కడే మరణించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, కారు నియంత్రణ కోల్పోయి నుజ్జునుజ్జు అయింది.

బెంగళూరులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శాటిలైట్ టౌన్ రింగ్ రోడ్డుపై రాత్రి సమయంలో బెంజ్ కార్ ప్రమాదానికి గురైంది. కారు అతివేగంతో డివైడర్‌ను ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనలో రిజ్వాన్ (30), అతని స్నేహితురాలు సజ్జియా(28) అక్కడిక్కడే మరణించారు. రిజ్వాన్‌కు వివాహం జరిగి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. రిజ్వాన్, సజ్జియాను తన వాహనంలో ఎక్కించుకుని, ఇద్దరూ దేవనహళ్లి నుండి తిరిగి వస్తుండగా హోస్కోట్ సమీపంలోని వంతెనపై ఈ ప్రమాదం జరిగింది.
శుక్రవారం రాత్రి సజ్జియా రిజ్వాన్‌తో కలిసి డిన్నర్‌కు వెళ్లింది. డిన్నర్ ముగించుకుని వారిద్దరూ బెంగళూరుకు తిరిగి వస్తుండగా, తెల్లవారుజామున సుమారు 12.45 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. రిజ్వాన్ తన క్లయింట్లలో ఒకరికి చెందిన మెర్సిడెస్-బెంజ్ కారును నడుపుతుండగా, అతి వేగంతో వాహనాన్ని కంట్రోల్ చేయలేకపోయాడు. ఈ ప్రమాద తీవ్రతకు వాహనం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. రిజ్వాన్ సన్‌రూఫ్ ద్వారా వాహనం నుండి బయటకు ఎగిరిపడ్డాడు. సజ్జియా మాత్రం కారుతో పాటే కాల్వలో పడిపోయింది. పోలీసులు విస్తృత గాలింపు చర్యల అనంతరం మృతదేహాన్ని మురుగు కాలువ నుంచి వెలికితీశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
