Delhi: స్కూళ్లకు సెలవులు.. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. మళ్లీ ఆ విధానం అమలులోకి..
వాతావరణ పరిస్థితులు బాగుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. లేకుంటే పీల్చేందుకు సరైన గాలి కూడా దొరకక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఏటా ఢిల్లీలో ఇలాంటి పరిస్థితే ఉంటుంది. పొగ, దుమ్ము తో..

వాతావరణ పరిస్థితులు బాగుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. లేకుంటే పీల్చేందుకు సరైన గాలి కూడా దొరకక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఏటా ఢిల్లీలో ఇలాంటి పరిస్థితే ఉంటుంది. పొగ, దుమ్ము తో నిండిపోయిన గాలి కారణంగా అక్కడి వాతావరణంలో కనీస నాణ్యత ప్రమాణాలు దారుణంగా పడిపోతాయి. ఈ పరిస్థితుల నడుమ కాలుష్యాన్ని నివారించేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఉద్యోగుల్లో సగం మందికి వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని కల్పించింది. వీలైతే ప్రైవేటు ఆఫీస్ లు కూడ ఇలాంటి చర్యలను చేపట్టాలని సూచించింది. అంతే కాకుండా రేపటి (శనివారం) నుంచి ప్రైమరీ స్కూళ్లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ సమావేశం నిర్వహించారు. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ నాలుగో దశ ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించారు.
ఈ ప్లాన్ ప్రకారం ఢిల్లీ వ్యాప్తంగా ప్రభుత్వ ఆఫీస్ లలో 50శాతం సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోం విధానం కల్పిస్తారు. ఆఫీసులు, మార్కెట్లు వర్కింగ్ టైమింగ్స్ ను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్లాన్ ను ఇంప్లిమెంట్ చేసి పర్యవేక్షించేందుకు ఆరుగురు సభ్యుల ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. కాలుష్యం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా కాలుష్య పరిస్థితులపై స్పందించారు.
కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉంది. కాబట్టి శనివారం నుంచి ప్రైమరీ స్కూళ్లను మూసివేస్తున్నాం. ఐదు, ఆపై తరగతుల విద్యార్థులకు అవుట్‌డోర్ గేమ్స్‌ను నిలిపివేస్తున్నాం. మళ్లీ ‘సరి-బేసి’ విధానాన్ని అమలు చేయాలనుకుంటున్నాం. సరిహద్దు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం కారణంగా దిల్లీలో నానాటికీ కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుతోంది. ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దు.




– అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి