CM MK Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్ నివాసానికి బాంబు బెదిరింపు
ఇటీవలే అనారోగ్యం కారణంగా హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకొని వచ్చిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నివాసానికి బాంబు బెదిరింపు రావడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయన నివాసంలో విస్తృత తనిఖీల చేపట్టిన తర్వాత ఇది తప్పుడు సమాచారంగా గుర్తించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సీఎం ఇంటిపైనే ఇలా తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇటీవలే అనారోగ్యం కారణంగా హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకొని వచ్చిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నివాసానికి బాంబు బెదిరింపు రావడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయన నివాసంలో విస్తృత తనిఖీల చేపట్టిన తర్వాత ఇది తప్పుడు సమాచారంగా గుర్తించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం చెన్నైలోని పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఒక గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి అల్వార్‌పేటలో ఉన్న సీఎం స్టాలిన్ నివాసంలో బాంబు పెట్టినట్లు చెప్పాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే చెన్నై నగర పోలీసులు, బాంబు డిస్పోజల్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్‌లతో సహా సీఎం నివాసానికి చేరుకున్నారు.
ఇంటి లోపల, పరిసర ప్రాంతాల్లో మొత్తం బాంబు కోసం జల్లెడ పట్టారు. సుమారు గంటన్నర పాటు అణువనువు క్షుణ్నంగా వెతికారు. చాలా సేపు తనిఖీల తర్వాత ఇంట్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని అధికారులు గుర్తించారు. ఇదొక తప్పుడు సమాచారం అని, నకిలీ బెదిరింపు కాల్ అని అధికారులు నిర్ధారించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ తప్పుడు బెదిరింపు కాల్ చేసింది ఎవరనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. కాల్ చేసిన ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




