AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kripal Singh Parmar: ఎన్నికలకు ముందు హిమాచల్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ.. కీలక నేత పార్మర్ రాజీనామా

Kripal Singh Parmar quits BJP: దేశంలో మరికొన్ని రోజుల్లో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ప్రధాన పార్టీలన్నీ దృష్టిసారించాయి. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. హిమాచల్ ప్రదేశ్

Kripal Singh Parmar: ఎన్నికలకు ముందు హిమాచల్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ.. కీలక నేత పార్మర్ రాజీనామా
Kripal Singh Parmar
Shaik Madar Saheb
|

Updated on: Nov 23, 2021 | 9:12 PM

Share

Kripal Singh Parmar quits BJP: దేశంలో మరికొన్ని రోజుల్లో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ప్రధాన పార్టీలన్నీ దృష్టిసారించాయి. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. హిమాచల్ ప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు కృపాల్ సింగ్ పర్మార్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేర‌కు పర్మార్.. త‌న రాజీనామా లేఖ‌ను హిమాచల్ ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సురేష్ కశ్యప్‌కు పంపించారు. పార్టీ ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటున్నానని.. తన రాజీనామాను ఆమోదించండి అంటూ ఆయన లేఖలో తెలిపారు. అయితే.. రాజీనామాకు గ‌ల కార‌ణాల‌ను త్వరలో వెల్లడిస్తానంటూ ఆయన పేర్కొన్నారు. కాగా.. హిమాచ‌ల్‌ప్రదేశ్ బీజేపీ రాష్ట్ర క‌మిటీ స‌మావేశాల‌కు ముందు ఉపాధ్యక్ష పదవి కృపాల్ సింగ్ రాజీనామా చేయ‌డం ప్రస్తుతం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. బీజేపీలో కృపాల్‌ను నిర్లక్ష్యం చేయడంతోనే ఆయన ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నారని పలువురు నేతలు పేర్కొంటున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రా జిల్లాలోని ఫతేపూర్ అసెంబ్లీ స్థానంలో పర్మార్ స్థానంలో పార్టీ బలదేవ్ ఠాకూర్‌ను పోటీకి దింపింది. దీంతో ఆయన ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఆ అవమానంతోనే ఆయన రాజీనామా చేశారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

కాగా.. కొద్ది రోజుల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని అధికార బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఉప ఎన్నికలు జరిగిన అన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఒక లోక్‌సభ సీటును, ఒక అసెంబ్లీ సీటును కాంగ్రెస్ గెలుచుకుంది. దీనిపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పార్టీ కీలక నేతలను కూడా మర్చాలని పలువురు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో పార్మర్ రాజీనామా చేయడం చర్చనీయాశంగా మారింది.

Also Read:

Bharat Gaurav Trains: పర్యాటక రంగం అభివృద్ధికి మోదీ సర్కార్ సన్నాహాలు.. త్వరలో 180 భారత్ గౌరవ్ రైళ్లు

Kangana Ranaut: సిక్కులపై చేసిన వ్యాఖ్యలపై కంగనా రనౌత్‌‌‌కు బిగుస్తున్న ఉచ్చు.. ముంబైలో కేసు నమోదు