Hidden Treasure: పాత ఇంటిని కూలకొట్టిన యజమాని.. అంతలో బయటపడిన పురాతన పెట్టె.. ఓపెన్ చేసి చూడగా షాకింగ్..

|

May 12, 2021 | 9:28 PM

Hidden Treasure: మహారాష్ట్రలోని వార్దా నాచన్‌గావ్‌లో పాత ఇంటిని స్థలంలో తవ్వకాలు జరుపుతుండగా గుప్త నిధులు బయటపడ్డాయి. మొఘలుల కాలానికి...

Hidden Treasure: పాత ఇంటిని కూలకొట్టిన యజమాని.. అంతలో బయటపడిన పురాతన పెట్టె.. ఓపెన్ చేసి చూడగా షాకింగ్..
Follow us on

Hidden Treasure: మహారాష్ట్రలోని వార్దా నాచన్‌గావ్‌లో పాత ఇంటిని స్థలంలో తవ్వకాలు జరుపుతుండగా గుప్త నిధులు బయటపడ్డాయి. మొఘలుల కాలానికి చెందిన 4 కిలోల 28 గ్రాముల బంగారం బయటపడింది. అందులో బంగారు బిస్కెట్లు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తవ్వకాల్లో లభ్యమైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు రూ. 20.54 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ ఘటన తాలూకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రైతు సతీష్ చందోర్ వార్ధాలోని నాచన్‌గావ్‌ వద్ద పాత ఇల్లు ఒకటి కొన్నాడు. అయితే ఇంటి స్థలంలో కొత్త ఇంటిని నిర్మించడం కోసం తవ్వకాలు ప్రారంభించాడు. తవ్విన మట్టిని పొలంలోకి తీసుకెళ్లి పోయించాడు. ఆ క్రమంలో కూలీ వాళ్లకు ఒక డబ్బా కనిపించింది. ఏంటా ఓపెన్ చేసి చూడగా.. పెట్టెలో బంగారం బయటడింది. అందులో బంగారు బిస్కెట్, మొఘల్ నాణెం, చెవి పోగులు సహా మొత్తం తొమ్మిది ఆభరణాలు ఉన్నాయి. వీటి బరువు 4 కిలోల 28 గ్రాములు ఉండగా.. వీటి విలువ రూ. 20.54 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసు అధికారులు.. విషయాన్ని పురావస్తు శాఖ అధికారులకు తెలియజేసి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీస్ ఇన్‌స్పెక్టర్ రవీంద్ర గైక్వాడ్ తెలిపారు. మొఘల్ కాలానికి చెందిన నాణేలు అందులో ఉన్నందున ఆ ప్రాంత చరిత్ర గురించి కొత్త సమాచారం తెలిసే అవకాశం ఉంది. ఈ నాణెలు ఇక్కడకు ఎలా వచ్చాయి? ఈ నాణెలు ఏ మొఘల్ చక్రవర్తి కాలం నాటివి? దాని వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? వంటి వాటిపై అధ్యయనం చేయడానికి పురావస్తు శాఖకు ఇవి సహాయపడుతాయని రవీంద్ర గైక్వాడ్ అన్నారు.

Also read:

Elderly Couple Dance: పూల చొక్కా తాత.. సొగసరి బామ్మ.. వాళ్ళ డ్యాన్స్ చూశారంటే.. ఫిదా అవ్వాల్సిందే ఎవరైనా! Viral Video

Telangana Corona Cases: తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కరోనా వ్యాప్తి.. క్రమంగా తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు..