Helicopter Crash in Kedarnath: కేదార్‌నాథ్‌‌లో కుప్పకూలిన హెలికాప్టర్‌.. ఏడుగురు దుర్మరణం

|

Oct 18, 2022 | 12:44 PM

ఉత్తరాఖండ్‌లో ఘోర హెలికాప్టర్‌ ప్రమాదం జరిగింది. కేదార్‌నాథ్‌ ఆలయానికి భక్తులను తీసుకెళ్తున్న హెలికాప్టర్‌ కుప్పకూలింది.

Helicopter Crash in Kedarnath: కేదార్‌నాథ్‌‌లో కుప్పకూలిన హెలికాప్టర్‌.. ఏడుగురు దుర్మరణం
Helicopter Crashes
Follow us on

ఉత్తరాఖండ్‌లో ఘోర హెలికాప్టర్‌ ప్రమాదం జరిగింది. కేదార్‌నాథ్‌ ఆలయానికి భక్తులను తీసుకెళ్తున్న హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. కేదార్‌నాథ్‌ ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో హెలికాప్టర్‌ క్రాష్‌ అయ్యింది. ప్రతికూల వాతావరణమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు చెబుతున్నారు. గరుడ పర్వతం దగ్గర ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి సహాయక బృందాలు చేరుకున్నాయి.

ఆర్యన్‌ కంపెనీకి చెందిన హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైనట్టు అధికారులు వెల్లడించారు. హెలికాప్టర్‌ ప్రమాదానికి 10 నిముషాల ముందు ఆ ప్రాంతంలో భారీ వర్షం కురిసినట్టు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదం కారణంగా కేదార్‌నాథ్‌ ఆలయానికి హెలికాప్టర్‌ సేవలను నిలిపివేశారు.

ఇవి కూడా చదవండి

హెలికాఫ్టర్ ఫటా నుంచి కేదార్‌నాథ్ కు యాత్రికులతో వెళ్తుండగా.. ఈ ఘటన జరిగింది. ఇద్దరు ఫైలట్లతోపాటు మరో ఐదుగురు భక్తులు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..