మేఘాలయలో భారీ వర్షాలు….కోల్ పిట్ లో చిక్కుకున్నవారిని రక్షించడంలో అవరోధాలు, ..కోల్ మాఫియా నిర్వాకమే ఇదంటున్న అధికారులు
మేఘాలయాలో భారీ వర్షాల కారణంగా కోల్ పిట్ లో చిక్కుకున్న కార్మికులను రక్షించడంలో అవరోధాలు ఎదురవుతున్నాయి. అస్సాంకు చెందిన నలుగురు, త్రిపుర నుంచి ఒకరు ఈ 'అక్రమ పిట్' లో చిక్కుకున్నట్టు గుర్తించారు.
మేఘాలయాలో భారీ వర్షాల కారణంగా కోల్ పిట్ లో చిక్కుకున్న కార్మికులను రక్షించడంలో అవరోధాలు ఎదురవుతున్నాయి. అస్సాంకు చెందిన నలుగురు, త్రిపుర నుంచి ఒకరు ఈ ‘అక్రమ పిట్’ లో చిక్కుకున్నట్టు గుర్తించారు. వీరు ఇందులో చిక్కుకుని రెండు రోజులైంది. డైనమైట్ బ్లాస్ట్ ఫలితంగా ఈ బొగ్గు గనిలో నీరు చేరిందని అధికారులు తెలిపారు. 25 మందితో కూడిన సహాయక బృందాలు వీరిని రక్షించడానికి కృషి చేస్తున్నాయి. సహాయక చర్యల్లో భాగంగా హైపవర్ పంపు నొకదానిని పిట్ లోకి జొప్పించే యత్నం చేయాలనీ భావిస్తున్నారు. అయితే ఈ కార్మికుల్లో ఎవరైనా జీవించి ఉంటారా అన్నది అనుమానమేనంటున్నారు. మొదట డైవర్లు ఇందులోకి దిగవలసి ఉంటుంది..అయితే భారీవర్షాలు ఇందుకు అవరోధంగా కన్పిస్తున్నాయి. కాగా అసలు ఈ ప్రమాదానికి కారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో చిక్కుకున్నవారి వివరాలు తెలియజేయాలని స్థానికులను అధికారులు కోరుతున్నారు. కానీ ఒక్కరు కూడా నోరు విప్పే సాహసం చేలేకపోతున్నారు. ఇందుకు కారణం కోల్ మాఫియా ఈ ప్రాంతంలో బలంగా ఉండడమే.. ఇప్పటికే గుర్తు తెలియని వ్యక్తులు కొందరు వచ్చి తమను బెదిరించినట్టు స్థానికుల్లో కొందరు తెలిపారు.
ఇప్పటివరకు మేఘాలయాలో ఈ విధమైన ఉదంతాలను తాము చూడలేదని వారు చెప్పారు. కాగా పిట్ లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు ఇంకా ముమ్మర యత్నాలు జరుగుతున్నాయి.
మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ :కన్నీళ్లకే కన్నీళ్లొచ్చే విషాద సంఘటన..!సమ్మక్క సారక్క పూజారిదంపతుల మృతి.కారణం తెలుసా..?:Sammakka Sarakka
ఓనర్స్ పనితో షాక్‌తిన్న కుక్కపిల్ల…నవ్వులే నవ్వులే ..వైరల్ అవుతున్న వీడియో : Dog funny video viral.
యూపీలో అనాముషం..డెడ్ బాడీ నదిలో పడేస్తూ వీడియోకు పోజులు ఇచ్చిన యువకులు: vial video.