ఉత్తరాది రాష్ట్రాల్లో పిడుగులు.. ఒక్క రోజే 31 మంది మృతి..

ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అందులోనూ బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో పిడుగులు పడుతున్నాయి. ఈ పిడుగుపాటు ఘటనల్లో ఇప్పటికే చాలా...

  • Tv9 Telugu
  • Publish Date - 10:19 am, Fri, 3 July 20
ఉత్తరాది రాష్ట్రాల్లో పిడుగులు.. ఒక్క రోజే 31 మంది మృతి..

ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అందులోనూ బీహార్, ఉత్తర్‌ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో పిడుగులు పడుతున్నాయి. ఈ పిడుగుపాటు ఘటనల్లో ఇప్పటికే చాలా మంది మరణించారు. తాజాగా గురువారం ఒక్కరోజే ఈ రెండు రాష్ట్రాల్లో పిడుగుపాటు కారణంగా
31 మంది మరణించారు.

బీహార్‌లో నిన్న ఒక్క రోజే వివిధ ప్రాంతాల్లో సంభవించిన పిడుగుపాటు ఘటనల్లో 26 మంది మృత్యువాత పడ్డారు. దీంతో వారం రోజుల్లో బీహార్‌లో పిడుగుల వల్ల చనిపోయిన వారి సంఖ్య 100 దాటిపోయింది. పాట్నా, సమస్తిపూర్, తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్, షియోహర్, కటియార్, పూర్ణ, మధేపుర జిల్లాల్లో ఎక్కువ మంది పిడుగుల వల్ల చనిపోయారు. మృతుల కుటుంబాలకు బీహార్ సీఎం నితీశ్ కుమార్ రూ.4 లక్షల ఆర్థిక పరిహారం ప్రకటించారు.

ఇక ఉత్తర ప్రదేశ్‌లో కూడా గురువారం పిడుగుపాటు కారణంగా ఐదుగురు చనిపోగా, 12 మంది గాయపడ్డారు. కాగా వీరి మృతి పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.

Read More:

సిగ్గు పడాల్సిన అవసరం లేదు.. ధైర్యంగా ఉండండి: నవ్య స్వామి

27 అడుగులకే ఖైరతాబాద్ గణేషుడు.. ఈసారి మట్టితో..