Himachal Pradesh: హిమాచల్‌లోని మండిలో వర్షం బీభత్సం.. ముగ్గురు మృతి.. కొట్టుకుపోయిన దుకాణాలు, బస్సులు

హిమాచల్ ప్రదేశ్‌లో మరోసారి కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. గత 24 గంటలుగా మండి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు అక్కడ పరిస్థితిని మరింత దిగజార్చాయి. నదులు, వాగుల నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగింది. దీని కారణంగా మండిలో వరద లాంటి పరిస్థితి ఏర్పడింది. జన జీవనం అస్తవ్యస్తమయింది.

Himachal Pradesh: హిమాచల్‌లోని మండిలో వర్షం బీభత్సం.. ముగ్గురు మృతి.. కొట్టుకుపోయిన దుకాణాలు, బస్సులు
Heavy Rain Lashes Himachal Pradesh

Updated on: Sep 16, 2025 | 9:49 AM

మరోసారి హిమాచల్ ప్రదేశ్ పర్వతాలకు వర్షం విపత్తును తెచ్చిపెట్టింది. మండి జిల్లాలో కుండపోత వర్షం పరిస్థితిని మరింత దిగజార్చింది. గత 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలు నదులు, వాగుల నీటి మట్టాన్ని అకస్మాత్తుగా పెంచాయి. ఈ విపత్తులో 3 మంది మరణించారు. ధరంపూర్‌లో, మార్కెట్‌లోకి, బస్ స్టాండ్‌లోకి వరద నీరు ప్రవేశించింది. ధరంపూర్ బస్ స్టాండ్ పూర్తిగా మునిగిపోయింది. అక్కడ నిలిపి ఉంచిన అనేక బస్సులు నీటిలో కొట్టుకుపోయాయి. మార్కెట్‌లోని డజన్ల కొద్దీ దుకాణాలు, స్టాళ్లు కూడా వరద ముంపులో చిక్కుకున్నాయి. ప్రజల ఇళ్ళు మోకాళ్ల వరకు నీటితో నిండిపోయాయి. అన్ని వస్తువులు నాశనమయ్యాయి.

మండిలో చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. భారీ వర్షం, వరదల కారణంగా ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. విపత్తు నిర్వహణ బృందాన్ని సంఘటనా స్థలానికి చేరుకుంది. అయితే చెడు వాతావరణం కారణంగా సహాయక చర్యలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఇప్పటివరకు అర డజను మంది తప్పిపోయినట్లు సమాచారం అందిందని పరిపాలన అధికారులు చెప్పారు. పోలీసులు, SDRF బృందాలు వారి కోసం నిరంతరం వెతుకుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ధరంపూర్ తో పాటు మండిలోని ఇతర ప్రాంతాలలో కూడా వర్షం బీభత్సం సృష్టించింది. అనేక గ్రామీణ ప్రాంతాలు కనెక్టివిటీని కోల్పోయాయి. చిన్న వంతెనలు కొట్టుకుపోయాయి. రోడ్లు శిథిలాలతో నిండిపోయాయి. మండి-కులు హైవేపై చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ట్రాఫిక్ పూర్తిగా స్థంభించింది. ప్రయాణీకులు గంటల తరబడి రోడ్డుపైనే చిక్కుకుపోవలసి వచ్చింది.

జనజీవనం అస్తవ్యస్తం

ఈసారి కురిసిన వర్షం చాలా సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టిందని ప్రజలు అంటున్నారు. ఆకస్మిక వరద ప్రజల దైనందిన జీవితాన్ని అస్తవ్యస్తం చేసింది. దుకాణాలు, ఇళ్ళు నీటిలో మునిగిపోయిన కుటుంబాలు ఇప్పుడు రాత్రంతా ఆరుబయట గడపవలసి వచ్చింది. సోషల్ మీడియాలో ఉన్న చిత్రాలు, వీడియోలు పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి. ధరంపూర్ మార్కెట్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. విరిగిన దుకాణాల శిథిలాలు, కొట్టుకుపోయిన వాహనాలు, బురదలో కనిపిస్తున్నాయి. తమకు జరిగిన నష్టానికి ప్రజలు బాధను వ్యక్తం చేస్తున్నారు.

వాతావరణ మార్పు, నిరంతరం పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా పర్వతాలలో ఇటువంటి విపత్తుల తరచుగా పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. నిరంతరాయంగా కురుస్తున్న కుండపోత వర్షం పర్వతాలకు ప్రమాదకరంగా మారుతున్నాయని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అధికారులు ప్రజలను సురక్షిత ప్రదేశాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..