AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flight Tickets: ఇండిగో బంపర్‌ ఆఫర్.. బస్ టిక్కెట్ ధరలకే విదేశాలకు ప్రయాణించే గోల్డెన్ ఛాన్స్..బుకింగ్ మొదలైంది బ్రో…

ఇయర్ ఎండింగ్‌, పండుగల సీజన్ దగ్గరపడుతున్న సమయంలో సాధారణంగానే అన్ని రవాణా మార్గాలతో పాటు విమాన ప్రయాణం కూడా రద్దీగా ఉంటుంది. ఇక విమాన టికెట్ల ధరలు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఇండిగో ఆఫర్ ప్రయాణికులకు నిజంగా గొప్ప ఊరట కలిగిస్తోంది. తక్కువ ధరలో ముందుగానే బుకింగ్ చేసుకోవడం ద్వారా మీరు సెలవులు, ఫ్యామిలీ ట్రిప్స్, బిజినెస్ టూర్స్ అన్నీ మీ బడ్జెట్‌లో పూర్తి చేసుకుంటారు. మీ ఇప్పుడు ఇండిగో ఈ ఆఫర్‌ తీసుకోచ్చింది..పూర్తి వివరాల్లోకి వెళితే..

Flight Tickets: ఇండిగో బంపర్‌ ఆఫర్.. బస్ టిక్కెట్ ధరలకే విదేశాలకు ప్రయాణించే గోల్డెన్ ఛాన్స్..బుకింగ్ మొదలైంది బ్రో...
Indigo Flight Ticket
Jyothi Gadda
|

Updated on: Sep 16, 2025 | 11:30 AM

Share

మీరు సెలవులు లేదంటే బిజినెస్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా..? అయితే, చౌక ధరలకు విమాన ప్రయాణం చేసే అవకాశం లభిస్తోంది. భారతదేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో వారం రోజుల పాటు ‘గ్రాండ్ రన్‌అవే ఫెస్ట్’ సేల్‌ను ప్రకటించింది. కంపెనీ సేల్ సెప్టెంబర్ 15 నుండి 21 వరకు జరుగుతుంది. ఈ సేల్ 2026 ప్రారంభంలో కస్టమర్లు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవడానికి సహాయపడుతుంది. ఈ ఆఫర్ కింద బుక్ చేసుకున్న టిక్కెట్లు జనవరి 7 నుండి మార్చి 31, 2026 వరకు ప్రయాణానికి చెల్లుతాయి. మరింకేం..సంక్రాంతి సెలవులు, పండుగలు లేదా వ్యాపార పనుల కోసం ముందుగానే టూర్‌ ప్లాన్ చేసుకునే వారికి ఇది మంచి అవకాశం అంటున్నారు నిపుణులు.

విమాన టిక్కెట్ ధరలు రూ.1,299 నుండి ప్రారంభమవుతాయి: ‘ గ్రాండ్ రన్‌అవే ఫెస్ట్ ‘ కింద వినియోగదారులు రూ.1,299 నుండి ప్రారంభమయ్యే వన్-వే దేశీయ ఛార్జీలను, రూ.4,599 నుండి ప్రారంభమయ్యే అంతర్జాతీయ ఛార్జీలను ఆస్వాదించవచ్చు. ఈ ఆఫర్ ఇండిగో వన్-వే బుకింగ్‌లకు మాత్రమే చెల్లుతుంది. రౌండ్-ట్రిప్ బుకింగ్‌లకు వర్తించదు. అలాగే, ఈ ఆఫర్ ఇండిగో నిర్వహించే నాన్-స్టాప్ విమానాలకు మాత్రమే చెల్లుతుంది.

ఎంపిక చేసిన దేశీయ మార్గాల్లో స్ట్రెచ్/బిజినెస్ క్లాస్‌కు అన్నీ కలిసిన (వన్-వే) ఛార్జీలు రూ. 9,999 నుండి ప్రారంభమవుతాయి.

ఇవి కూడా చదవండి

బ్లూచిప్ సభ్యులకు ఆఫర్: ఇండిగో ప్లాట్‌ఫామ్ ద్వారా బుక్ చేసుకునే వారికి బ్లూచిప్ సభ్యులకు 10శాతం వరకు అదనపు తగ్గింపులు, లగేజీ, భోజనం, సీటు ఎంపిక వంటి ఆకర్షణీయమైన ఆఫర్‌లతో సహా అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

బుక్ చేసుకోవడం ఎలా?: ఇండిగో వెబ్‌సైట్ ( www.goindigo.in ), మొబైల్ యాప్, AI- పవర్డ్ అసిస్టెంట్ 6Eskai లేదా ఇండిగో వాట్సాప్ +91 70651 45858 ద్వారా బుకింగ్‌లను సులభంగా చేసుకోవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..