హాథ్రస్‌ ఘటనను సుమోటో కేసుగా స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ

ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో జరిగిన దారుణమైన ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్సయ్యింది.. సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునే ఆ ఘటనలో 19 ఏళ్ల ఓ దళిత యువతిని అగ్రకులానికి చెందిన నలుగురు వ్యక్తులు...

హాథ్రస్‌ ఘటనను సుమోటో కేసుగా స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ
Follow us

|

Updated on: Oct 01, 2020 | 12:34 PM

ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో జరిగిన దారుణమైన ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్సయ్యింది.. సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునే ఆ ఘటనలో 19 ఏళ్ల ఓ దళిత యువతిని అగ్రకులానికి చెందిన నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి ఆపై తీవ్రంగా హింసించారు.. ఆమె అరవకుండా నాలుక కోసేశారు. వెన్నెముక విరిచేశారు.. ఈ ఘోర ఘటనలో గాయపడిన ఆ దళిత యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.. కాగా, ఈ ఘటనను సుమోటో కేసుగా స్వీకరించినట్టు జాతీయ మానవ హక్కుల సంఘం తెలిపింది.. దీనిపై వివరణ ఇవ్వాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర డీజీపీకి నోటీలు జారీ చేసింది.. ఈ దుర్మార్గమైన సంఘటన సెప్టెంబర్‌ 14న జరిగింది.. తన తల్లి, సోదరుడితో కలిసి గడ్డి కోసం పొలానికి వెళ్లిన యువతి.. ఆపై కనిపించకుండా పోయింది.. తీవ్రగాయాలతో ఆ యువతిని సెప్టెంబర్‌ 22న కనుగొన్నారు.. బాధితురాలిని మొదట అలీఘడ్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ కాలేజీ అండ్‌ హాస్పిటల్‌లో చేర్పించారు.. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆసుప్రతిలో చేర్చారు.. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఆమె కన్నుమూసింది. ఈ ఘటనపై దేశం యావత్తు కదిలింది.. నిరసనలు హోరెత్తాయి.. ఆందోళనలు జరుగుతున్నాయి.. ఇంత జరుగుతున్నా బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత యువతి మృతదేహాన్ని ఆమె స్వస్థలానికి తీసుకొచ్చిన పోలీసులు హుటాహుటిన అంత్యక్రియలు నిర్వహించారు.. పోలీసుల చర్యపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు