అక్టోబరు నెలలో బ్యాంక్ సెలవులు ఎన్నో తెలుసా..

దేశంలో అన్‌లాక్ ప్రక్రియ మొదలుకావడంతో బ్యాంకుల్లో లావాదేవీలు కూడా పుంజుకున్నాయి. ఈ సమయంలో మీకు బ్యాంకులో ఏమైనా పని ఉండొచ్చు. కాబట్టి అక్టోబరు నెలలో బ్యాంకు సెలవు రోజులు ఎన్ని ఉన్నాయో తెలుసుకుని మీ పనికి ఎటువంటి..

అక్టోబరు నెలలో బ్యాంక్ సెలవులు ఎన్నో తెలుసా..
Follow us

|

Updated on: Oct 01, 2020 | 1:07 PM

Banks To Remain Closed October : దేశంలో అన్‌లాక్ ప్రక్రియ మొదలుకావడంతో బ్యాంకుల్లో లావాదేవీలు కూడా పుంజుకున్నాయి. ఈ సమయంలో మీకు బ్యాంకులో ఏమైనా పని ఉండొచ్చు. కాబట్టి  అక్టోబరు నెలలో బ్యాంకు సెలవు రోజులు ఎన్ని ఉన్నాయో తెలుసుకుని మీ పనికి ఎటువంటి ఆటంకం లేకుండా చక్కబెట్టుకోండి. దేశవ్యాప్తంగా ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు 2020 అక్టోబర్ నెలలో 14 రోజులు పనిచేయవు.

ప్రతీ ఆదివారంతో పాటుగా రెండో శనివారం, నాలుగో శనివారం కలుపుకుని ఈ నెలలో మొత్తంగా 14 రోజులు బ్యాంకులు పనిచేయవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకం ప్రకారం, అన్ని ప్రభుత్వ సెలవు దినాల్లో బ్యాంకుల సెలవు. ఆర్‌బీఐ వెబ్‌సైట్ ప్రకారం, అక్టోబర్ సెలవుల జాబితాలో గాంధీ జయంతి, మహాసప్తమి, దసరా పండుగ, మిలాద్ ఉన్ నబీ ఉన్నాయి.

ఇక అక్టోబర్ 4, 11, 18, 25 తేదీలలో ఆదివారాలు. అలాగే అక్టోబర్ 10, 24 తేదీలు రెండో, నాలుగో శనివారాలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో శని, ఆదివారాల్లో నవమి, దసరా (అక్టోబరు 25) పండుగ లొచ్చాయి. కరోనా నేపథ్యంలో ఎక్కువగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వైపే మొగ్గు చూపడం మంచిది. ఇక అసలు అక్టోబర్ నెలలో ఏయే రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

  • అక్టోబర్ 2020 : ప్రధాన సెలవులు
  • అక్టోబర్ 2 – మహాత్మా గాంధీ జయంతి (అన్ని రాష్ట్రాలు)
  • అక్టోబర్ 8 – చెల్లం (ప్రాంతీయ)
  • అక్టోబర్ 23 – మహాసప్తమి (చాలా రాష్ట్రాలు)
  • అక్టోబర్ 26 – విజయ దశమి (చాలా రాష్ట్రాలు)
  • అక్టోబర్ 29 – మిలాద్ ఉన్ నబీ (ప్రాంతీయ)
  • అక్టోబర్ 31 – మహర్షి వాల్మీకి, సర్దార్ పటేల్ జయంతి (ప్రాంతీయ)

అక్టోబర్ 4, 11, 18, 25 తేదీలలో ఆదివారాలు…అక్టోబర్ 10, 24 తేదీలు రెండో, నాలుగో శనివారాలు