Viral: సరిగ్గా మూడు ముళ్లు వేసే టైంకి ట్విస్ట్ ఇచ్చిన వధువు.. కన్నీళ్లు పెట్టుకున్న వరుడు
పెళ్లంటే నూరేళ్ల పంట.. రెండు జంటల కలయిక.. రెండు కుటుంబాల అనుబంధం.. జీవితాంతం గుర్తుంచుకునే వేడుక.. అందుకే.. అంగరంగ వైభవంగా చేసుకునేందుకు లక్షలు ఖర్చయినా వెనుకాడరు. ఇక్కడ కూడా అదే జరిగింది. మేళతాళాల మధ్య కాసేపట్లో మూడుముళ్ల సీన్.. ఇంతలో ఈ వరుడు నాకొద్దంటూ దిమ్మ తిరిగిపోయే ట్విస్ట్ ఇఛ్చింది వధువు. ఇంతకీ ఏం జరిగింది?

పెళ్లంటే ఎన్ని ఆశలుంటాయ్. ఎన్ని ఎమోషన్లు ఉంటాయ్..! అమ్మాయికి, అబ్బాయికి మనసులు కలవాలి.. రెండు కుటుంబాల మధ్య ఎమోషనల్ బంధం ఏర్పడాలి.. అప్పుడే కదా పెళ్లిసందడి కనిపించేది..! కర్నాటకలో జరిగిన ఓ పెళ్లిలో ఆఖరు నిమిషంలో అనూహ్యమైన ఘటన జరిగింది. తాళి కట్టే టైమ్‌లో తనకు పెళ్లి వద్దంటూ అమ్మాయి ఏడ్చేసింది. ఇది చూసి తల్లిదండ్రులే కాదు బంధువులూ షాకైపోయారు.
కర్నాటక జిల్లా హాసన్ మండలం బూవనహళ్లి గ్రామానికి చెందిన యువతికి.. ఆలూరు తాలుకా యువకుడికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఆహ్వాన పత్రికలు పంచారు.. పెళ్లి బట్టలు, బంగారం ఇలా అన్ని కొనుగోలు చేశారు. చుంచనగిరి కల్యాణ మండపంలో పెళ్లి. ఎంట్రీ నుంచి మండపం వరకు అన్నీ రిచ్‌గా ఉండేలా జాగ్రత్తపడ్డారు. బంధువులంతా వచ్చారు.. పెళ్లి తంతును తిలకించారు.
ప్లేటు ఫిరాయించిన వధువు
కాళ్లు కడగటం, జీలకర్ర, బెల్లాన్ని వధూవరులు ఒకరి శిరస్సు మీద మరొకరు ఉంచడం, కన్యాదానం, సువర్ణజలాభి మంత్రం ఇలా ఒకదానికి తర్వాత ఒకటి జరుగుతూ వచ్చాయి. చివర్లో మూడుముళ్ల తంతు.. అందరూ ఆసక్తిగా ఆ ఘట్టం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో వధువుకు ఓ ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ మాట్లాడిన తర్వాత నుంచి తను ఏడుపు లఖించుకుంది. ఏంటా అని అడిగేసరికి.. ప్లేటు ఫిరాయించింది. నాకొద్దీ పెళ్లంటూ తెగేసి చెప్పింది. ఈ హఠాత్ పరిణామం ఇరు కుటుంబాలనే కాదూ.. అక్కడున్న వాళ్లందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది.
ఎందుకిలా చేస్తున్నావని బంధువుల ప్రశ్నలు
కన్నవాళ్లు, అయినవాళ్లు అందరూ ఎందుకిలా చేస్తున్నావని వధువును ప్రశ్నించారు. ఆమెను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారు. కానీ వధువు ఎవ్వరి మాటా వినలేదు. పెళ్లి ఆగిపోయిన మ్యాటర్ తెలుసుకున్న పోలీసులు కూడా పెళ్లి మండపానికి వచ్చారు. ఏం జరిగిందని ఆరా తీశారు. అప్పుడు ఓపెన్ అయింది వధువు.. తాను వేరే అబ్బాయిని ప్రేమిస్తున్నానని. దీంతో నోరెళ్లబెట్టడం అక్కడున్నవాళ్ల వంతయింది.
యువతిపై బంధువుల ఆగ్రహం
వధువు అలా చెప్పడంతో వరుడు కూడా చివరికి పెళ్లి వద్దని చెప్పేశాడు. అతను కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ వివాహ కార్యక్రమానికి వచ్చిన బంధువులంతా తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. ప్రేమించిన మాట ముందే చెప్పకుండా.. మండపం దాకా ఎందుకు తీసుకొచ్చిందంటూ యువతిని తిట్టిపోశారు. లాస్ట్ మినిట్‌లో పెళ్లి ఆగిపోవడం సినిమాల్లో చూస్తుంటాం.. కానీ ఇక్కడ మాత్రం స్వయంగా చూసి వెళ్లారంత.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.
