Liquor Policy: ఆఫీస్‌లో దర్జాగా మద్యం తాగొచ్చు.. గుడ్‌న్యూస్ చెప్పిన ఆ రాష్ట్ర సర్కార్
భారతదేశంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం ఇంకా అనుమతించబడదు. అయితే క్రమంగా నిబంధనలను సడలిస్తున్నట్లుగానే అనిపిస్తోంది. ఎందుకంటే హర్యానా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఈ చర్చకు దారి తీస్తోంది. మందు తాగాలంటే వైన్ షాప్‌కో లేదా బార్ అండ్ రెస్టారెంట్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు..హాయిగా మీ ఆఫీసులోనే తాగొచ్చు. కొత్త పాలసీ.. కొత్త మందు..
మందు తాగాలని లాగేస్తోందా..? మద్యం తాగేందుకు ప్లాన్ చేయాలా..? సమీపంలో బార్ అండ్ రెస్టారెంట్, వైన్ షాపు కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారా.. ఇక ఆ చింత అవసరంలేదు. ఆఫీసు సమయంలో తాగాలని అనిపిస్తే చాలు.. హాయిగా తాగొచ్చు. ఎక్కడికో పరుగులు పెట్టాల్సిన అవసరం లేదంటూ కొత్త నిబంధన తీసుకొచ్చింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఆ రాష్ట్రం అంటే అదేదో మన తెలుగు రాష్రాలు అని అనుకుంటే పొరపడినట్లే.. ఇది హర్యానా సర్కార్ తాజాగా తీసుకున్న నిర్ణయం. రాష్ట్ర ప్రభుత్వం న్యూ లిక్కర్ పాలసీని తీసుకొచ్చింది. ఇందులో మీరు కోరకున్నటువంటి పానీయాలను మీరు పనిచేసే చోటే అందించనుంది.
హర్యానాలో త్వరలో ఇది సాధ్యం కానుంది. ఇందుకోసం హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ విధానాన్ని మార్చింది. కొత్త విధానం ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యాలయాలకు మద్యం అందించడానికి అనుమతి ఇచ్చింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ మినహాయింపు బీర్ లేదా వైన్ వంటి తక్కువ ఆల్కహాల్ కలిగిన పానీయాలకు మాత్రమే ప్రస్తుతం అందించనున్నట్లుగా ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చింది.
వారికి మాత్రమే ఈ సౌకర్యం..
రాష్ట్ర ప్రభుత్వ నూతన విధానం ప్రకారం కనీసం 5 వేల మంది పని చేసే కార్యాలయ ఆవరణలో బీర్ లేదా వైన్ తాగవచ్చు. కనీస కవర్ విస్తీర్ణం 1 లక్ష చదరపు అడుగులు. అంటే ఆఫీసు విస్తీర్ణం ఇంతకు మిచి ఉండాలి. రాష్ట్ర నూతన ఎక్సైజ్ పాలసీ ప్రకారం దీని కోసం కంపెనీలు ఏటా రూ.10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. 5 వేల కంటే ఎక్కువ మంది ఉద్యోగులు, 1 లక్ష చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న కార్యాలయాలు ఈ రుసుము చెల్లించి సంవత్సరం మొత్తం లైసెన్స్ తీసుకోవచ్చు.
వైన్, బీర్ కూడా చౌకగా..
హర్యానా ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీ వచ్చే నెల అంటే జూన్ 2023 నుంచి అమలులోకి రాబోతోంది. అంటే వచ్చే నెల నుంచి హర్యానాలో ఉన్న పెద్ద ఆఫీసులు తమ ఉద్యోగులకు క్యాంటీన్‌లో టిఫిన్లు, టీలతోపాటు బీరు తాగే సదుపాయాన్ని కల్పించవచ్చు. దీంతో పాటు బీరు, వైన్‌లపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. హర్యానాలో వచ్చే నెల నుంచి బీర్, వైన్ ధరలు తగ్గనున్నాయి.
బార్ లైసెన్స్ చౌకగా..
జూన్ 12 నుంచి అమల్లోకి రానున్న ఎక్సైజ్ పాలసీ 2023-24కి హర్యానా ప్రభుత్వ క్యాబినెట్ ఈ వారం ఆమోదం తెలిపింది. కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత బీర్-వైన్ చౌకగా ఉండడమే కాకుండా రెస్టారెంట్లు, పబ్‌లు, కేఫ్‌లకు బార్ లైసెన్స్ పొందడం కూడా చౌకగా మారనుంది. వీరికి లైసెన్సు ఫీజును ప్రభుత్వం తగ్గించింది. హర్యానాలోని గురుగ్రామ్ వంటి నగరాలు అనేక బడా కార్పొరేట్లకు కేంద్రాలుగా ఉన్నాయి. ఈ విధానం బహుళజాతి కార్పొరేట్లకు నచ్చవచ్చు. వారి ఆకర్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే రాబోయే రోజుల్లో దేశంలోని మిగిలిన రాష్ట్రాలు కూడా హర్యానాతో పోటీ పడే అవకాశం ఉంది. ఇందుకు ఆలస్యం మీరు కూడా హర్యానాకు ట్రాన్స్‌ఫర్ పెట్టుకోండే..
మరన్ని జాతీయ వార్తల కోసం